/rtv/media/media_files/2025/10/29/hair-health-tips-2025-10-29-13-38-04.jpg)
Hair Health Tips
జుట్టు సంరక్షణలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. సరైన షాంపూ, నూనె వాడకంతోపాటు జుట్టు దువ్వే విధానం కూడా చాలా ముఖ్యం. స్నానం చేసిన వెంటనే తడి జుట్టును చిక్కు తీయడానికి ప్రయత్నించడం సరైనదేనా అనే సందేహం చాలా మందిలో ఉంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలని, తక్కువగా రాలాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం సరైన మందులు, నూనెలు వాడుతున్నప్పటికీ.. దువ్వే విషయంలో చేసే పొరపాటు సమస్యను పెంచుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వాలా లేదా పొడిగా ఉన్నప్పుడు దువ్వాలా అనేది జుట్టు రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఆరోగ్యంగా, తక్కువగా రాలడంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
జుట్టు రకాన్ని బట్టి దువ్వే విధానం:
స్ట్రెయిట్ హెయిర్ (Straight Hair): స్ట్రెయిట్ హెయిర్ వాడితే.. తడిగా ఉన్నప్పుడు దువ్వడం హానికరం. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. జుట్టు తడిగా ఉన్నప్పుడు దాని మూలాలు బలహీనంగా ఉంటాయి. ఆ సమయంలో దువ్వితే జుట్టు సులభంగా విరిగిపోతుంది లేదా రాలిపోతుంది. అందుకని స్ట్రెయిట్ హెయిర్‌ను పూర్తిగా తడి లేకుండా.. కొద్దిగా ఆరిన తర్వాత అంటే కొంచెం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే దువ్వాలి. దీనికోసం వెడల్పాటి పళ్ల దువ్వెనను ఉపయోగించి సున్నితంగా చిక్కు తీయాలి. ఇలా చేయడం వలన జుట్టు చిట్లిపోవడం,విరిగిపోవడం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో కొట్టుకొస్తున్న టన్నుల కొద్ది బంగారం!
కర్లీ హెయిర్ (Curly Hair): కర్లీ హెయిర్ వాడితే ఈ నియమం పూర్తిగా వ్యతిరేకం. అంటే కర్లీ హెయిర్‌ను తడిగా ఉన్నప్పుడే దువ్వాలి. ఎందుకంటే అవి ఆరిన తర్వాత చాలా చిక్కుపడిపోయి.. దువ్వినప్పుడు ఎక్కువగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కర్లీ హెయిర్‌కు కండీషనర్ లేదా సీరమ్ అప్లై చేసి తడిగా ఉన్నప్పుడే వెడల్పాటి పళ్ల దువ్వెనతో సున్నితంగా దువ్వడం ఉత్తమం. ఇది కర్ల్స్ ఆకారాన్ని కాపాడుకోవడానికి, జుట్టు దెబ్బతినకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. జుట్టు స్ట్రెయిట్ అయినా, కర్లీ అయినా, ఎప్పుడూ వెడల్పాటి పళ్ల దువ్వెననే ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే జుట్టును దువ్వేటప్పుడు బలవంతంగా లేదా వేగంగా దువ్వడం పూర్తిగా మానుకోవాలి. సున్నితంగా దువ్వడం వలన జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే దంతాల పొడి చేయండి.. పళ్లు తల తలా మెరిసేలా చేసుకోండి.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి
Follow Us