/rtv/media/media_files/2025/08/29/menstrual-cups-2025-08-29-13-28-05.jpg)
Menstrual cups
నెలసరి(Periods) సమయంలో ఒకప్పుడు కాటన్ క్లాత్‌ను ఉపయోగించేవారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారు. ఇవి వాడటానికి ఈజీగా ఉన్నా ఎన్నో అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్యాడ్స్‌లో కృత్రిమ రసాయనాలు ఉంటాయి. ఇలాంటి ప్యాడ్స్ వాడటం వల్ల చర్మంపై దద్దర్లు, దురద, అలెర్జీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్యాడ్స్‌ను కొందరు ఎక్కువ గంటల పాటు వాడుతుంటారు. దీంతో గాలి తగలక, ఇన్ఫెక్షన్ కూడా సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ప్యాడ్స్ తయారీలో ఎన్నో రసాయనాలు వాడటం వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాడ్స్ వల్ల పర్యావరణానికి హాని....
నిజానికి ప్యాడ్‌ను 8 గంటలకు ఒకసారి మారుస్తుండాలి. ఇలా మార్చకపోతే బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ప్యాడ్స్ వాడకం వల్ల పర్యావరణానికి కూడా నష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే వీటిని బయోడిగ్రేడబుల్ కాని ప్లాస్టిక్ పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి భూమిలో కలిసి పోవడానికి చాలా ఏళ్లు పడతాయి. దాదాపుగా దాదాపు 500 నుంచి 800 సంవత్సరాలు పడుతుంది. దీనివల్ల వ్యర్థాలు కూడా భారీగా పెరిగి.. పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ ప్యాడ్స్ కొన్ని సమయాల్లో అసౌకర్యంగా కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని విధాలుగా ఈ ప్యాడ్స్ డేంజర్. వీటికి బదులుగా మెన్‌స్ట్రువల్ కప్స్(Menstrual Cups) వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
ఐదు నుంచి పదేళ్ల వరకు..
ఈ మెన్‌స్ట్రువల్ కప్స్‌ను మెడికల్ గ్రేడ్ సిలికాన్ లేదా రబ్బరుతో చిన్న కప్పులుగా చేస్తారు. వీటిని యోని లోపల అమర్చి వాడితే ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకవని నిపుణులు అంటున్నారు. ఒక మెన్‌స్ట్రువల్ కప్‌ను సరిగ్గా శుభ్రం చేసి జాగ్రత్తగా వాడితే 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు. దీనివల్ల ప్రతి నెలా ప్యాడ్స్ కొనే ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. ఈ మెన్‌స్ట్రువల్ కప్స్ మళ్లీ మళ్లీ వాడటానికి అనుకూలంగా ఉంటాయి. వీటివల్ల ఎలాంటి వ్యర్థాలు కూడా ఉత్పత్తి కావు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. అయితే ఒక మెన్‌స్ట్రువల్ కప్ సుమారు 8 నుంచి 12 గంటల వరకు ద్రవాన్ని సేకరించగలదు. దీనివల్ల ప్యాడ్స్ మాదిరిగా తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు.
ఇది కూడా చూడండి: Period Pain Exercises: పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉందా..? ఈ వ్యాయామలతో పూర్తిగా ఉపశమనం
ఇది ప్రయాణాలలో, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే మెన్‌స్ట్రువల్ కప్స్ యోని లోపల సీల్ అయి ఉండటం వల్ల గాలి తగలదు. దీని ద్వారా బాక్టీరియా పెరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నిజానికి ఈ కప్‌ను సరిగ్గా అమర్చిన తర్వాత లోపల ఉన్నట్లు కూడా అనిపించదు. దీనివల్ల ఎలాంటి శారీరక శ్రమ అయినా సులభంగా చేయవచ్చు. స్విమ్మింగ్, రన్నింగ్ వంటివి చేసేటప్పుడు కూడా వీటిని ధరించవచ్చు. అయితే మెన్‌స్ట్రువల్ కప్స్ వాడిన తర్వాత బాగా శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Kidney: నిద్రలేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే కిడ్నీ దెబ్బతిన్నట్లే..!!