Toothache
Toothache: పంటి నొప్పి అనేది చిన్న సమస్యలా అనిపించవచ్చు కానీ అది శరీరాన్ని అలసిపోయే స్థాయిని కలిగిస్తుంది. ఈ నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిల్లో దంతక్షయం, ఇన్ఫెక్షన్‌లు, చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. సున్నితమైన దంతాలు ఉన్నవారు ఎక్కువగా పంటి నొప్పి వస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు ఈ సమస్యను మరింతగా పెంచుతాయి. ఎవరైనా ఈ రకమైన నొప్పి నుంచి తప్పించుకోవాలంటే.. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
రోజూ తాగే కాఫీతో ప్రమాదం:
చల్లటి పదార్థాలు, ఐస్ క్రీం ఈ సమస్యను ఎక్కువగా చేస్తుంది. ఐస్ క్రీంలో ఉన్న అధిక చక్కెర, తక్కువ ఉష్ణోగ్రతలు సున్నితమైన దంతాలకు హానికరంగా మారతాయి. చక్కెర బ్యాక్టీరియా పెరిగి దంతక్షయానికి దారి తీస్తుంది. అలానే ఆల్కహాలిక్ పానీయాలు, బీరు, వైన్ వంటి వాటిలో కూడా చక్కెర వల్ల దంతాలను ప్రభావితం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆమ్లత ఎక్కువగా ఉండటం వల్ల దంతాలపై ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. రోజూ తాగే కాఫీ కూడా ప్రమాదకరమైనదే. దాని ఉష్ణోగ్రత, ఆమ్లత స్థాయి, చక్కెర కలిపి దంతాల సున్నితత్వాన్ని పెంచుతాయి. ఇది నెమ్మదిగా దంతాల్లో నొప్పిని పెంచేలా మారుతుంది.
ఇది కూడా చదవండి: ఇంట్లోనే నాణ్యమైన నెయ్యి.. ఈ చిట్కాతో తయారీ సులభం
జిగురుగా ఉండే క్యాండీలు ప్రమాదకరమైవి. ఇవి దంతాలకి అంటుకుని ఉండి బాక్టీరియాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. చిన్నపిల్లలు వీటిని తింటే దంత నష్టం తలెత్తే అవకాశాలు ఎక్కువ. నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, టమాటా వంటి వాటిలో సహజ ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. ఇవి దంతాలపై ఉన్న పరిరక్షక పొరను మందగించేస్తాయి. ఈ విధంగా ఎన్నో ఆహార పదార్థాలు మనకు తెలియకుండానే పంటి నొప్పికి కారణమవుతుంటాయి. కాబట్టి సున్నితమైన దంతాలు ఉన్న వారు , ఇప్పటికే నొప్పితో బాధపడుతున్న వారు ఈ రకమైన ఆహార పదార్థాలను తగ్గించుకుంటే సమస్యను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: రాత్రి నిద్రకు ముందు ఇలాంటి దుస్తులకు దూరంగా ఉండండి
( Toothache Relief Tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )