Diet
Diet: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు ఒకటి. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ మందులు వాడతారు. చాలా మంది ఉప్పు తీసుకోవడం తగ్గించిన తర్వాత కూడా వారి రక్తపోటును నియంత్రించుకోలేరు. అలాంటి వారు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న DASH డైట్‌ని ఫాలో అయితే మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని పాటించడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించవచ్చని వైద్యులు అంటున్నారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు తమ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరి. DASH డైట్‌ను డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్‌టెన్షన్ డైట్ అని కూడా అంటారు.
రక్తపోటును అదుపులో..
దీని ప్రధాన లక్ష్యం సోడియం తీసుకోవడం తగ్గించడం. పొటాషియం తీసుకోవడం పెంచడం. DASH డైట్ ఫాలో అయ్యే వారు ముఖ్యంగా ప్రతిరోజూ ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో కనీసం 100 గ్రాముల ఆకుకూరలు చేర్చుకోండి. ఎందుకంటే లెట్యూస్, పాలకూర వంటి వాటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అలాగే రోజువారీ ఆహారంలో 30 గ్రాముల గింజలు ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణుడు డాక్టర్ లహరి అంటున్నారు. రక్తపోటును అదుపులో ఉంచడానికి సిట్రస్ పండ్లు ముఖ్యంగా మంచివి.
ఇది కూడా చదవండి: బీపీ చెక్ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఎందుకంటే వాటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించి రక్త నాళాలను సడలించడానికి సహాయపడతాయి. ఫలితంగా బీనీని తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు. రోజువారీ ఆహారంలో ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వంటివి చేర్చుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బృందం నిర్వహించిన అధ్యయనంలో DASH ఆహారం BPని నియంత్రించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. DASH డైట్ పాటించేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కొవ్వు అధికంగా ఉండే జంతు మూలం కలిగిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి. వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా DASH ఆహారంలో భాగంగా కృత్రిమ తీపి పదార్థాలు, బెల్లం, చక్కెర, ఉప్పు వాడకాన్ని వీలైనంత తగ్గించడం జరుగుతుంది. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. బీపీ పెరగకుండా కూడా నిరోధించవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హిట్ అండ్ రన్.. అమ్మాయిని ఢీకొట్టి స్కోడా కారు పరార్!
( daily-diet | health-tips | latest health tips | best-health-tips | latest-news)