TG Crime: హిట్ అండ్ రన్.. అమ్మాయిని ఢీకొట్టి స్కోడా కారు పరార్!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో బైక్‌ను స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువతి స్పందన స్పాట్‌లోనే మృతి చెందింది. సాయి కుమార్ అనే యువకుడుకి తీవ్ర గాయాలయ్యాయి. స్పందన స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లపూర్‌గా గుర్తించారు.  

New Update
TG Crime

TG Crime

TG Crime: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం స్కోడా కారు డ్రైవర్ అక్కడి నుంచి పరిపోయ్యాడు. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువతి స్పందన స్పాట్‌లోనే మృతి చెందింది.సాయి కుమార్ అనే యువకుడు ప్రాణాపాయ స్థితిలో  కోట్టుమిట్టాడుతున్నాడు. మృతురాలి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చిల్లపూర్‌గా గుర్తించారు. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ బీ ఫార్మసీ చదువుతోంది.

 కారు ఢీకొని..

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత స్పందన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా్పత్రికి, గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: తరచుగా పార్కులకు వెళ్తున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోండి

స్పందన కామరణించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. చదువుకుంటున్నా బిడ్డ చనిపోవడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలమకున్నాయి. పోలీసులు ప్రమాదపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది..? ప్రమాదం తర్వాత కారుతో డ్రైవర్‌ ఎక్కడికి పారిపోయాడనే విషయాలపై పోలీసు అన్ని సీసీ కెమరాలతోపాటు అన్ని కోణాల్లో చెక్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బీపీ చెక్‌ చేసుకునేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు

( ts-crime | ts-crime-news | latest-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు