Fenugreek And Betel leaves: దీన్ని తమలపాకులతో కలిపి తింటే మీకు తిరుగుండదు

కొందరు భోజనం అనంతరం తమలపాకులను తినే అలవాటు ఉంటుంది. తమలపాకు, మెంతులు కలిపి తింటే శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో, నోటి వ్యాధుల నివారణలో, జీర్ణక్రియను గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం, పొత్తికడుపు అసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.

New Update
Fenugreek And Betel leaves

Fenugreek And Betel leaves

Fenugreek And Betel leaves: తమలపాకులు, మెంతులు అనేవి మన పూర్వీకులు ఆరోగ్యానికి ఉపయోగపడే ఔషధ లక్షణాలతో సంపన్నమైన పదార్థాలుగా పరిగణించేవారు. ఇప్పటికీ కొందరు భోజనం అనంతరం తమలపాకులను తినే అలవాటును పాటిస్తున్నారు. తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబయల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో, నోటి వ్యాధుల నివారణలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక మెంతుల్లో ఉండే డైటరీ ఫైబర్, గ్లూకోసమైన్, యాంటీ యాసిడ్ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం, పొత్తికడుపు అసిడిటీ వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి.

మధుమేహంతో బాధపడేవారికి..

ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకుంటే శరీరానికి సహజ డిటాక్సిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహంతో బాధపడేవారికి ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మేలుచేస్తుంది. ఎందుకంటే మెంతులు చక్కెర శోషణను తగ్గిస్తే తమలపాకులు ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి. ఇది మహిళలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మెంతులు హార్మోన్ల స్తాయిని సమతుల్యం చేయడం ద్వారా PCOD, క్రమరహిత రజస్వల చక్రాలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. తమలపాకులు గర్భాశయాన్ని శుభ్రంగా ఉంచే గుణంతో పాటు రుతుక్రమ నొప్పులను సైతం తగ్గిస్తాయి. 

ఇది కూడా చదవండి: సిగరెట్లు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా?

ఈ కలయిక శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచి కీళ్ల నొప్పులు, వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నోటి ఆరోగ్య పరిరక్షణ కోణంలో కూడా ఇది ప్రయోజనకరమైనది. ఎందుకంటే తమలపాకులు క్రిములను చంపే గుణం కలిగి ఉండగా, మెంతులు నోటి పూతలు, వాపు వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాత్రి సమయంలో ఒక టీ స్పూన్ మెంతులు నీటిలో నానబెట్టి ఉదయం ఒక తాజా తమలపాకు మీద వాటిని వేసి నమిలి తినాలి. అనంతరం గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని కొనసాగించడంలో ఇది సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ విషయం తెలిస్తే పేపర్‌ కప్పులలో అస్సలు టీ తాగరు


( betel-leaves | latest health tips | best-health-tips | health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు