/rtv/media/media_files/2025/04/19/papercuptea1-106304.jpeg)
చాలామంది పేపర్ కప్పులలో టీ, కాఫీ, ఇతర వేడి పానీయాలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు నిపుణులు చెబుతున్న విషయాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. పేపర్ గ్లాసు పేరు చెప్పినప్పటికీ అది కేవలం కాగితంతో తయారు కాలేదు.
/rtv/media/media_files/2025/04/19/papercuptea9-506494.jpeg)
అందులో మైక్రోప్లాస్టిక్ అనే రసాయన పదార్థం ఉండటం వల్ల అది నీటిని లేదా ఇతర ద్రవాలను అడ్డుకునే లక్షణాన్ని పొందుతుంది. అయితే అదే మైక్రోప్లాస్టిక్ వేడి ఉన్నపుడు క్రమంగా విడిపడి డ్రింక్‌లో కలిసిపోతుంది.
/rtv/media/media_files/2025/04/19/papercuptea5-648830.jpeg)
ఇది మనం తాగినప్పుడు, నెమ్మదిగా శరీరంలోకి చేరి దీర్ఘకాలంలో పలు జీర్ణ సంబంధ సమస్యలకు దారి తీస్తుంది. ఈ మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలో పోషకాలు శోషణ ప్రక్రియను ప్రభావితం చేస్తాయి.
/rtv/media/media_files/2025/04/19/papercuptea6-951867.jpeg)
అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇవి కణ విభజనకు కారణమవుతూ క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తాయి. వేడి పానీయాలు పేపర్ గ్లాసులో తాగడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువవుతుంది.
/rtv/media/media_files/2025/04/19/papercuptea8-739799.jpeg)
ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత కారణంగా మైక్రోప్లాస్టిక్ శక్తివంతంగా విడుదలవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది. పేపర్ గ్లాసులో కనిపించని మైక్రోప్లాస్టిక్ కణాలు కడుపులో చేరి అక్కడ నెమ్మదిగా జీర్ణ వ్యవస్థను దెబ్బతీయడం మొదలవుతుంది.
/rtv/media/media_files/2025/04/19/papercuptea4-957953.jpeg)
స్టీల్ గ్లాసులు లేదా గాజు గ్లాసులు ఉపయోగించటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కేవలం సౌకర్యం కోసం వాడే పేపర్ గ్లాసులు, భవిష్యత్తు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు అంటున్నారు. పేపర్ గ్లాసు వాడకాన్ని తగ్గించడమే ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్త అంటున్నారు.
/rtv/media/media_files/2025/04/19/papercuptea2-989889.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.