Cigarettes: సిగరెట్లు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందా?

అధిక ఒత్తిడి, ఇంట్లో సమస్యలు ఆనారోగ్యాన్ని పెంచుతాయి. తాత్కాలికంగా రిలీఫ్ కోసం సిగరెట్‌ తాగుతారు. సిగరెట్ తాగినప్పుడు మెదడులోని డోపమైన్ విడుదలై కొద్దీసేపు సంతోషంగా అనిపిస్తుంది. సలైన రిలీఫ్ అనేది సిగరెట్‌లో కాదు మనలోనే ఉంటుందని నిపుణులు అంటున్నారు.

New Update

Cigarettes: ఇటీవలి కాలంలో ఉద్యోగ భారం, వ్యక్తిగత సమస్యలు, నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పని ప్రదేశంలో ఎదురయ్యే ఒత్తిడి, ఇంట్లో సమస్యలు కలసి శాంతిని హరించి వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తాత్కాలికంగా రిలీఫ్ కోసం సిగరెట్‌కు ఆశ్రయిస్తున్నారు. ఇది మొదట్లో ఓ ఊరటగా అనిపించినా తర్వాత నష్టాన్ని మిగుల్చే అలవాటుగా మారుతుంది. సిగరెట్ తాగినప్పుడు మెదడులోని డోపమైన్ విడుదల కావడం వల్ల కొంతకాలం సంతోషంగా అనిపిస్తుంది. అయితే  ఇది తాత్కాలికమే.

మానసిక సమస్యలు:

ఈ ప్రభావం తగ్గిన తర్వాత మళ్ళీ అదే ఒత్తిడి తిరిగి వస్తుంది. ఇకపోతే నికోటిన్ శరీరాన్ని తక్షణ ఉత్సాహంతో నింపినట్టు అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది హార్మోన్ల అసమతుల్యతను కలిగిస్తుంది. దీని వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. నికోటిన్ ఒక వ్యసన దాయక పదార్థం. దాని లభ్యత తగ్గినప్పుడు మనసు ఆతృతతో బాధపడుతుంది. మానసికంగా అసహనంగా మారి మళ్ళీ అదే అలవాటును ఆశ్రయించటం జరుగుతుంది. ఇలా చేస్తూ మానసిక సమస్యలు తీరక పోవడమే కాకుండా శారీరకంగా కూడా తీవ్ర నష్టాలను కలిగించవచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సిగరెట్‌ను శాశ్వతంగా మానేయాలనే సంకల్పం అవసరం.

ఇది కూడా చదవండి: మీకు మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ఉందా?.. ఈ 5 షాకింగ్ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఇది సులభం కాదు కానీ సాధ్యం. నిత్యం నడక, వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమలు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. లోతైన శ్వాస తీసుకోవడం, సకాలంలో నిద్రపోవడం, కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడటం వంటి అలవాట్లు మెదడును రిలాక్స్ చేస్తాయి. పుస్తకాలు చదవడం, సంగీతం విన్నటవంటివి మనసు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడతాయి. అసలైన రిలీఫ్ అనేది సిగరెట్‌లో ఉండదు. అది మనలోనే ఉంటుంది. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మానసిక శాంతి కూడా సులభంగా దొరుకుతుంది. ధూమపానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడం కాదు అది కేవలం మరింతగా పెరగటానికే దారి తీస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కర్నూలులో విషాదం.. ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి.. ఆ తల్లి ఏం చేసిందంటే?

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు