Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది స్పాట్ డెడ్!

బీహార్‌లోని కటిహార్‌ జిల్లా చంద్‌పూర్ హనుమాన్ ఆలయం సమీపంలో ట్రాక్టర్, వివాహ బృందం సభ్యులతో నిండిన స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Katihar road accident

Katihar road accident

Crime News:  బీహార్‌లోని కటిహార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి జిల్లాలోని పోథియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని SH 77 రోడ్డులోని చంద్‌పూర్ హనుమాన్ ఆలయం సమీపంలో ట్రాక్టర్, వివాహ బృందం సభ్యులతో నిండిన స్కార్పియో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వైద్యం కోసం సమేలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

Also Read :  రోజూ మనకు తెలియకుండానే ఈ విషాహారం తీసుకుంటున్నాం

అదుపు తప్పి.. 

పూర్ణియా జిల్లా బర్హారా కోఠిలోని ధిబ్రా బజార్ నుంచి 10 మంది వ్యక్తులు కోష్కిపూర్‌లో ఒక వివాహ ఊరేగింపుకు స్కార్పియోలో ప్రయాణిస్తున్నారు.  చాంద్‌పూర్ చౌక్ దగ్గర మొక్కజొన్న కుప్పను తప్పించబోయి స్కార్పియో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టిందని సంఘటనకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం గాయపడిన వారిని, మృతులను పోస్టుమార్టం నిమిత్తం సామెలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఇది కూడా చదవండి: రోజుకు పావుగంట నవ్వితే ఈ అద్భుత ప్రయోజనాలు

ఉదయ్ కుమార్, అభిషేక్‌  అనే ఇద్దరు యువకుల పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంపై కుటుంబ సభ్యుల్లో, పెళ్లి వేడుకల్లో విషాద ఛాయలు అములుకున్నాయి. మృతులు చూసి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కటిహార్ ఎస్పీ వైభవ్ శర్మ సంఘటనలో 8 మంది మృతి చెదినట్లు ధృవీకరించారు. ఈ  ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఎండలో తిరిగినా ఏమీ కాదా?

Also Read :  వ్యాయామంతో ముఖంలో కాంతి పెరుగుతుందా?


( crime news | latest-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు