Onion: ఉల్లిపాయలను వెనిగర్‌లో ముంచి తింటే 3 వ్యాధులు మాయం

ఉల్లిపాయలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగిస్తుంది. ప్రతిరోజూ వెనిగర్‌తో ఉల్లిపాయలు తింటే మంచి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ 30% వరకు పెరుగుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్‌, కడుపు, పెద్దపేగు క్యాన్సర్ రేటు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

New Update
Onion

Onion Photograph

Onion: హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఉచితంగా వెనిగర్‌లో ముంచిన ఉల్లిపాయను ఇస్తారు. ఇది ఆహారం రుచిని మెరుగు పరచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెనిగర్‌లో ఉల్లిపాయ వేయడం వల్ల దాని పోషక విలువలు లాక్ చేయబడతాయి. ఉల్లి పాయలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.ఉల్లి పాయలను వెనిగర్‌తో ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఎండు ద్రాక్ష తింటే మీరే సూపర్‌ మ్యాన్‌..చాలా ప్రయోజనాలు

క్యాన్సర్‌ను తగ్గించడంలో..

అంతే కాకుండా ప్రతిరోజూ వెనిగర్‌తో ఉల్లి పాయలు తినడం వల్ల మంచి హెచ్‌డిఎల్ (HDL) కొలెస్ట్రాల్ 30% వరకు పెరుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఉల్లి పాయలో అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి ఇన్సులిన్ మాదిరిగా పనిచేస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చేసిన పరిశోధనలో వైట్ వెనిగర్ రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయ పడుతుందని తేలింది.

ఇది కూడా చదవండి: నారింజను తినే ముందు ఇది తెలుసుకోండి.. లేకపోతే మీ దంతాలు..!!

పురుషులలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి ప్రోస్టేట్ గ్రంధిని ప్రభావితం చేస్తుంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రచురించబడిన అధ్యయనాలు అల్లియం కుటుంబానికి చెందిన కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తగ్గించడంలో సహాయ పడతాయని చెబుతున్నాయి. అలాగే ఉల్లిపాయలు తినడం వల్ల కడుపు, పెద్దపేగు క్యాన్సర్ రేటు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితోపాటు ప్రతి రోజు యోగా, వాకింగ్, ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవాలి. ఇలా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెడితే వైరస్ లాంటి ప్రమాదల నుంచి  గట్టేకే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బరువు తగ్గొచ్చు

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పొట్టిగా ఉన్నారా..ఈ హోమ్‌ రెమెడీలతో ఎత్తుపెరగండి

Advertisment
Advertisment
తాజా కథనాలు