పూర్వం రోజుల్లో ఎక్కువగా పొయ్యి మీద మట్టి పాత్రల్లో వండుకునే వారు. కానీ ప్రస్తుతం అంతా ఫ్యాషన్ అయిపోయింది. గ్యాస్ మీద వివిధ రకాల పాత్రల్లో కుక్ చేస్తున్నారు. వీటిలో కుక్ చేసిన ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మట్టి పాత్రలే ఆరోగ్యానికి మేలు. ప్రస్తుతం చాలా మంది నాన్ స్టిక్ పాన్స్, అల్యూమినియం పాత్రల్లో ఎక్కువగా వంట చేస్తున్నారు. వీటిలో వంట చేసిన ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం డేంజర్‌లో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
ఎక్కువ సమయం ఉంచితే..
అల్యూమినియం పాత్రల్లో యాసిడ్ ఉన్న పదార్థాలు అంటే సిట్రిక్ ఆమ్లం వంటివి కలిస్తే విషం అవుతుంది. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు అయిన క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడతారు. అల్యూమినియం పాత్రల్లో ఎక్కువగా వేడి చేయకూడదు, చేసిన పదార్థాలను ఉంచకూడదు. ఈ పాత్రల్లో వండిన పదార్థాలను తినడం వల్ల బ్రెయిన్ క్రోమాటిక్ నెట్‌వర్క్‌పై ప్రభావం పడుతుంది.
ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
దీంతో బ్రెయిన్ సెల్స్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మట్టి, స్టీల్ పాత్రలు లేదా ఎనొడైజ్డ్ అల్యూమినియం పాత్రలను వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎనొడైజ్డ్ మెటల్‌తో తయారు చేసిన పాత్రలు, పాన్‌లు త్వరగా వేడెక్కుతాయి. అలాగే ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి.
ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!