Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

న్యూ ఇయర్ వేడుకల కోసం కడప నుంచి గండికోటకు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. జమ్మలమడుగు దగ్గర కారు అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
karnul accident

ROAD ACCIDENT IN PUNJAB Photograph: (ROAD ACCIDENT IN PUNJAB)

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి అందరూ ప్లాన్ చేసుకుంటారు. ఈ వేడుకలు కొందరి జీవితాల్లో సంతోషాన్ని ఇస్తే.. మరికొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతాయి. హ్యాపీగా ఫ్రెండ్స్‌తో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేసుకోగా.. అకస్మాత్తుగా ప్రమాదం జరిగి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్‌..ఎంత వింతగా ఉందో చూడండి!

కారు అదుపు తప్పడంతో..

వివరాల్లోకి వెళ్తే.. పులివెందులకు చెందిన కొందరు యువకులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి గండికోటకు వెళ్తుండగా జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌

ఇదిలా ఉండగా.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మద్దిమడుగు గ్రామంలో వెంకటేశ్ - రమ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె -  ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఈ ఇద్దరి కుమారుల్లో చిన్న కుమారుడు సోమవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ముర్రం కోటేశ్వరరావు సోదరితో కలిసి మట్టి తేవడానికి పోలానికి వెళ్లాడు. ఆ సమయంలోనే వీరిద్దరూ ముర్రం కోటేశ్వరరావు కంట పడ్డారు. దీంతో వెంటనే కోటేశ్వరరావు గొడ్డలితో ఆ బాలుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!

ఇది కూడా చూడండి: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!

Advertisment
తాజా కథనాలు