Early Morning: ఉదయాన్నే టీ తాగుతున్నారా.. వెరీ డేంజర్.. ఛాయ్‌కి బదులు ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే హెల్తీ!

ఉదయం లేచిన వెంటనే టీ తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. అయితే టీ కంటే పసుపు పాలు, నిమ్మ నీరు, గ్రీన్ టీ, కొబ్బరి నీరు, బీట్ రూట్ వంటివి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Tea

Tea Photograph: (Tea)

ఉదయం లేచిన వెంటనే టీ(Drinking Tea) తాగనిదే కొందరికి రోజు కూడా గడవదు. టీ తాగిన తర్వాతే వారికి శుభోదయం అవుతుంది. అయితే పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణ క్రియ మందగించడం, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం పూట టీ కాకుండా ఇంకా ఏ పదార్థాలు తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Health Benefits: ఈ డ్రింక్ రోజుకు గ్లాస్ తాగితే చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరార్!

పసుపు పాలు

ఉదయాన్నే పసుపు పాలు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే అలసట, వికారం వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. పసుపు పాలలో ఉండే పోషకాలు శారీరక నొప్పులను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

నిమ్మరసం నీరు

ఉదయం పూట టీ కంటే నిమ్మ కాయ నీరు(Lemon Water) తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. వీటితో పాటు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు చర్మాన్ని కూడా మెరుగుపరుస్తుందట. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మ నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇందులో కాస్త అల్లం, పుదీనా వంటివి కలిపి తాగితే రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటారని నిపుణులు అంటున్నారు. 

గ్రీన్ టీ

గ్రీన్ టీ(Green Tea) ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. సాధారణ టీ, కాఫీ కంటే గ్రీన్ టీ బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రీన్ టీలో తక్కువ కెఫిన్ ఉంటుంది. ఇది ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి  బెస్ట్ మెడిసన్ అని చెప్పవచ్చు. 

బీట్రూట్, క్యారెట్ జ్యూస్

క్యారెట్, బీట్రూట్ కలిపి చేసిన జ్యూస్ విటమిన్-ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనిని ఉదయం తాగడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు. ఇది చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరులో తక్కువ చక్కెర ఉంటుంది. ఇందులో అవసరమైన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది టీ, కాఫీల కంటే చాలా బెటర్. కొబ్బరి నీరు తక్షణ శక్తిని అందిస్తుంది. యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Belly Fat Control Tips: అమేజింగ్.. బొడ్డు కొవ్వును వెన్నలా కరిగించే అద్భుతమైన చిట్కా ఇదే..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు