Health Benefits: ఈ డ్రింక్ రోజుకు గ్లాస్ తాగితే చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పరార్!

రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. గ్లాసు వైన్ తీసుకోవడం వల్ల గుండె పోటు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

New Update
Red wine

Red wine

మద్యం అనారోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతుంటారు. అయితే రెడ్ వైన్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. ఎంత మితంగా తీసుకుంటే అన్ని లాభాలు.. ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకి ఒక చిన్న గ్లాసు రెడ్ వైన్ తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. అయితే రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Health Tips: ఈ హెల్తీ జ్యూస్‌ను ఆ సమయంలో తాగుతున్నారా.. ఇక మీ ప్రాణాలు కాపాడటం దేవుడి వల్ల కాదు

గుండె ఆరోగ్యం

రెడ్ వైన్ మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే వాపును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. 

క్యాన్సర్ నివారణ

రెడ్ వైన్‌లో ఉండే సమ్మేళనాలు రొమ్ము క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫినాల్స్ అనే పదార్థాలు ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయి. అలాగే నోటి క్యాన్సర్ ను కూడా నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మితంగా చిన్న గ్లాసు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని నిపుణులు అంటున్నారు. 

జీర్ణశక్తి మెరుగుదల

రెడ్ వైన్‌లో యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. రెడ్ వైన్‌ను మితంగా తాగేవారికి జీర్ణక్రియ బాగా జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా వైన్ తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

జ్ఞాపకశక్తి పెరుగుదల

రెడ్ వైన్ జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు మెదడులో బీటా-అమిలాయిడ్ ప్రోటీన్ పేరుకుపోకుండా చేస్తుంది. మెదడులో ప్రోటీన్ పేరుకుపోవడం వల్లనే అల్జీమర్స్ అనే వ్యాధి వస్తుంది. ఒక గ్లాసు వైన్ మెదడులో ఉండే వాపును, విష పదార్థాలను తగ్గించి మనసుకు విశ్రాంతిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఎముకలు

రెడ్ వైన్ మితంగా తాగేవారికి బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మద్యం అస్సలు తాగనివారి కంటే, అలాగే ఎక్కువగా తాగేవారి కంటే మితంగా వైన్ తాగేవారికి ఎముకల సాంద్రత ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మహిళలలో మితంగా వైన్ తాగే వారికి ఎముకలు బలంగా ఉన్నట్లు ఒక పరిశోధనలో వెల్లడైంది.

జాగ్రత్తలు

ఏదైనా సరే పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మోతాదులో తాగితే గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే రెడ్ వైన్ తీసుకునేటప్పుడు వైద్యుల సూచనలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Early Morning: ఉదయం తినకుండా ఎక్కువ సేపు ఆకలితో ఉంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Advertisment
తాజా కథనాలు