/rtv/media/media_files/2025/09/21/fenugreek-seeds-control-tips-2025-09-21-20-20-17.jpg)
Fenugreek seeds benefits for belly fat reduction
ప్రస్తుత కాలంలో పొట్ట కొవ్వు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారమే దీనికి ప్రధాన కారణం. తీపి పదార్థాలు, జంక్ ఫుడ్, వేపుడు పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. అది మాత్రమే కాకుండా శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కేలరీలు బర్న్ కావు.. అలాగే నిద్రలేమి, ఒత్తిడి కూడా దీనికి దోహదం చేస్తాయి. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో ‘కార్టిసోల్’ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది పొట్ట దగ్గర కొవ్వు పేరుకునేలా చేస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ జీవక్రియ మందగించడం, హార్మోన్ల అసమతౌల్యం కూడా బొజ్జ పెరగడానికి కారణమవుతాయి.
కొన్ని ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన కారకాలు కూడా దీనికి ప్రభావితం చేయవచ్చు. పొట్టకొవ్వును తగ్గించేందుకు చాలా మంది జిమ్‌లలో గంటలు గంటలు శ్రమిస్తున్నారు. కానీ ఎలాంటి మార్పు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కఠినమైన నిర్ణయం తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వును వెన్నలా కరిగించుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, అధిక కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారాలు తగ్గించడం, అలాగే తగినంత నిద్ర, ప్రశాంతంగా ఉండటం అవసరం. మరీ ముఖ్యంగా పొట్ట కొవ్వు తగ్గడానికి మెంతి గింజలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మెంతి గింజల వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
మెంతి గింజల ప్రయోజనాలు
మెంతులు బొడ్డు కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడతాయి. వేల సంవత్సరాలుగా భారతీయ, గ్రీకు, ఈజిప్షియన్, రోమన్ సంస్కృతుల ప్రజలు మెంతుల గింజలను సుగంధ ద్రవ్యంగా, ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. మెంతి గింజలు బొడ్డు కొవ్వును తగ్గించడంలో చాలా సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కడుపు నిండినట్లు అనిపించి.. తరచుగా ఆహారాన్ని తినడాన్ని కంట్రోల్ చేస్తుంది.
ఇది బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతి గింజల్లోని గెలాక్టోమన్నన్ వంటి కరిగే ఫైబర్‌లు.. జీర్ణక్రియను వేగవంతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, ఆహార కోరికలను తగ్గించడానికి కూడా ఎంతో యూజ్ అవుతాయి. దీనివల్ల పొట్టకొవ్వు క్రమ క్రమంగా తగ్గుతుంది. వీటిని తీసుకుంటూ తరచూ వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట కొవ్వు కంట్రోల్ అవుతుంది.
మెంతి గింజలను ఎలా తినాలి
ఒక టీస్పూన్ మెంతుల గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి.
తరువాత ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి.
నచ్చితే.. నానబెట్టిన విత్తనాలను కూడా తినవచ్చు.
ఇది కాకుండా మరో పద్దతి కూడా ఉంది. మెంతుల గింజలను తేలికగా వేయించి పొడిలా చేసుకోవాలి. దాన్ని తరచూ అర టీస్ఫూన్ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.