Drinks: మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..

ఈ రోజుల్లో ఎక్కువగా తాగడానికి ఇష్టపడే వాటిల్లో పానీయాలు ఒకటి. ఆల్కహాల్‌తోపాటు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి మరింత వేగంగా వ్యాపిస్తోంది. సాఫ్ట్ డ్రింక్స్, బోబా, బబుల్ టీ వంటి ఎక్కువగా తాగితే ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

New Update

Drinks: ఆల్కహాల్ కాలేయానికి ప్రమాదకరమని చెబుతారు. కానీ ఈ రోజుల్లో.. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి మరింత వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలని నిపుణులు అంటున్నారు. అయితే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలోనే గుర్తిస్తే సరైన జీవనశైలి, ఆహారంతో దానిని తిప్పికొట్టవచ్చు.  మూడు పానీయాలు నిరంతరం తీసుకుంటే కొవ్వు కాలేయానికి మరింత నష్టం కలిగించవచ్చు. నెమ్మదిగా మిమ్మల్ని లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి గురి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

మార్కెట్లో ఎనర్జీ డ్రింక్స్.. 

అందులో మొదటిది సాఫ్ట్ డ్రింక్స్. ఈ రోజుల్లో ఎక్కువగా తాగడానికి ఇష్టపడే వాటిల్లో ఇది ఒకటి. ఇంట్లో, బయట, ఏదైనా చిరుతిండి, ఆహారంతో కలిపి తాగుతారు. ఈ శీతల పానీయాలు కార్న్ సిరప్, ఎక్కువ చక్కెర, అధిక ఫ్రక్టోజ్‌తో నిండి ఉంటాయి. దీనిని తాగడం వల్ల కాలేయం దానిని ప్రాసెస్ చేయడం కష్టమైవుతుంది. అదనంగా చక్కెర కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు క్రమంగా కాలేయ కణాలలో పేరుకుపోతుంది. స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్లో విస్తృతంగా అమ్ముతున్నారు. ఈ పానీయాలు ఆరోగ్యకరమైనవిగా చెబుతారు.  

ఇది కూడా చదవండి: ముఖం మీద వాపు ఉందా..? 5 కారణాలు కారణం కావచ్చు

 
యువత రెస్టారెంట్లకు వెళ్లి బోబా టీ వంటి పానీయాలు తాగుతారు. ఈ బోబా టీ వల్ల కాలేయం కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. చాలా కాలంగా బోబా టీని నిరంతరం తాగుతుంటే అది కాలేయంపై ఒత్తిడిని పెంచుతుంది. ఈ క్రీమీ ఫ్లేవర్, నమిలే టేపియోకా ముత్యాలు, తీపి బోబా, బబుల్ టీలో 50 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది రోజువారీ వినియోగం కంటే ఎక్కువ. ఇది శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గ్లూకోజ్‌గా మారుతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ వంటి వ్యాధిలో బోబా టీని నిరంతరం తీసుకుంటే కొంతకాలం తర్వాత లివర్ సిర్రోసిస్ వస్తుందని నిపుణులు హెచ్చస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్... ఇనుప రాడ్డుతో గుండెల్లో గుచ్చి దారుణంగా..

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
తాజా కథనాలు