Diwali 2025: దీపావళి వేళ మార్కెట్లో భారీగా నకిలీ పనీర్.. ఈ సింపుల్ చిట్కాతో ఇట్టే గుర్తు పట్టండి!!

మార్కెట్‌లో నకిలీ లేదా కల్తీ పన్నీర్ లభించే అవకాశం ఉంది. నకిలీ పన్నీర్ ఆరోగ్యానికి హానికరం కావడమే కాకుండా.. పండుగ వంటకాల రుచిని కూడా పాడు చేస్తుంది. అందుకే తాజా, మృదువైన, క్రీమీ పన్నీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం సురక్షితమైన, ఉత్తమమైన మార్గం.

New Update
Diwali 2025

Diwali 2025

దీపావళి పండుగ(Diwali 2025) ప్రారంభం కాగానే మార్కెట్‌లో మిఠాయిలు(sweets), పండుగ వంటకాల కోసం విక్రయాలు పెరుగుతాయి. అయితే ప్రతి ఏటా వచ్చే నివేదికల ప్రకారం.. ఈసారి కూడా మార్కెట్‌లో నకిలీ లేదా కల్తీ పన్నీర్(paneer) లభించే అవకాశం ఉంది. నకిలీ పన్నీర్ ఆరోగ్యానికి హానికరం కావడమే కాకుండా.. పండుగ వంటకాల రుచిని కూడా పాడు చేస్తుంది. అందుకే తాజా, మృదువైన, క్రీమీ పన్నీర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవడం సురక్షితమైన, ఉత్తమమైన మార్గం. పన్నీర్ తయారు చేయడం కష్టమైన పని అనుకుంటే పొరపాటే. కొన్ని నిమిషాల్లోనే దీనిని సులభంగా తయారు చేయవచ్చు. ఈ ఇంటి పన్నీర్ రుచి, నాణ్యత మార్కెట్ పన్నీర్ కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంట్లోనే తాజా, మృదువైన పన్నీర్‌ను ఎలా తయారు చేసుకోవాలో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సులభగా ఇంట్లో పన్నీర్ తయారు విధానం:

ముందు పాలు ఓ గీన్నేలో పోసి మరిగించాలి. మొదటగా, ఫుల్ క్రీమ్ పాలను మంటపై పెట్టి బాగా ఉడికించాలి. పాలు అడుగున అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత పాలు ఉడకడం మొదలయ్యాక.. అందులో నిమ్మరసం, తెల్ల వెనిగర్‌ను నెమ్మదిగా కలుపుతూ.. తేలికగా తిప్పాలి. కొద్దిసేపట్లోనే పాలు విరిగి.. నీరు వేరు అవుతుంది. ఇప్పుడు ఒక సన్నటి గుడ్డ లేదా జల్లెడ సహాయంతో విరిగిన పాలను వడకట్టాలి. అదనపు నీరంతా పోయి.. కేవలం పన్నీర్ ఘన పదార్థం మిగులుతుంది. వీనిని వడకట్టిన పన్నీర్‌ను గుడ్డలో చుట్టి.. తేలికగా నొక్కాలి. తద్వారా మిగిలిన నీరు కూడా బయటికి పోయి పన్నీర్ చక్కటి ఆకారం సంతరించుకుంటుంది.

ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్ నాడు దీపం వెలిగించడంతోపాటు ఈ 4 పనులు చేయండి.. మీకు డబ్బే డబ్బు!!

చివరిగా పన్నీర్‌ను 1-2 గంటలు చల్లబరచడానికి ఉంచాలి. ఆ తర్వాత తాజా, మృదువైన ఇంటి పన్నీర్ సిద్ధమవుతుంది.  ఇది 100% స్వచ్ఛమైనది మరియు తాజాది. ఇందులో కల్తీ పన్నీర్లలో ఉండే రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు ఉండవు. ఇది ఆరోగ్యాన్ని, వంటకాల రుచిని రెండింటినీ పెంచుతుంది. అయితే నకిలీ పన్నీర్ లక్షణాలు కొన్ని ఉంటాయి.  మార్కెట్ పన్నీర్ చాలా మెరుస్తూ, తెల్లగా ఉంటుంది. ఇవి రుచి తక్కువగా ఉంటుంది. నీటిలో వేసినప్పుడు తొందరగా విరిగిపోతుంది. ఈ దివాళికి నకిలీ పన్నీర్‌కు దూరంగా ఉండి.. ఇంట్లోనే తాజా పన్నీర్ తయారు చేసుకొని వంటకాల రుచిని రెట్టింపు చేసుకోవచ్చు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చదవండి: చెమట కంపు కొండుతుందా.. అయితే ఈ రోగాలున్నాయేమో చెక్ చేసుకోండి!!

Advertisment
తాజా కథనాలు