Dhanteras 2025: ధన్‌తేరాస్ నాడు దీపం వెలిగించడంతోపాటు ఈ 4 పనులు చేయండి.. మీకు డబ్బే డబ్బు!!

ధనత్రయోదశి ఈ ఏడాది 2025 అక్టోబర్ 18 శనివారం నాడు వస్తోంది. ధనత్రయోదశి సాయంత్రం వేళ కొన్ని ప్రత్యేక పనులు చేయడం వలన ఏడాది పొడవునా ధన ప్రవాహం ఉంటుందని.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

New Update
Dhanteras 2025

Dhanteras 2025

దీపావళి పండుగకు నాంది పలికే ధనత్రయోదశి (ధన్‌తేరస్) పర్వదినం ఈ ఏడాది 2025 అక్టోబర్ 18 శనివారం నాడు వస్తోంది. కార్తీక మాసం కృష్ణ పక్షంలోని పదమూడవ రోజున జరుపుకునే ఈ శుభదినాన, సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని మరియు సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం ఆనవాయితీ. ధనత్రయోదశి సాయంత్రం వేళ కొన్ని ప్రత్యేక పనులు చేయడం వలన ఏడాది పొడవునా ధన ప్రవాహం ఉంటుందని.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే ధనత్రయోదశి రోజు సాయంత్రం తప్పక చేయాల్సిన ఐదు ముఖ్య విషయాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

లక్ష్మీ-కుబేరుల ఆశీస్సుల కోసం..

13 దీపాలను వెలిగించడం: ధన, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ధనత్రయోదశి సాయంత్రం 13 దీపాలను వెలిగించాలి. ఇది కుబేరుడిని, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక సాంప్రదాయక ఆచారం.

కుబేర పూజ-మంత్ర జపం: దీపాలు వెలిగించిన తర్వాత.. కుబేరుడిని, ఇంట్లోని ధనాన్ని భద్రపరిచే పెట్టె (తిజోరి)ని ఆచారాలతో పూజించాలి. ధూపం, దీపం, చందనం, నైవేద్యాలు, పుష్పాలు, పండ్లు సమర్పించాలి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన-ధాన్య అధిపతయే ధన-ధాన్య సమృద్ధిం మే దేహి దాపయ దాపయ స్వాహా అనే మంత్రాన్ని జపించాలి.

ప్రధాన ద్వారం వద్ద ఓం గుర్తు: పసుపు, బియ్యం కలిపిన ముద్దతో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఓం గుర్తును పెట్టండి. ఇది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడానికి సూచనగా భావిస్తారు.

శంఖంతో నీటి ప్రోక్షణ: కుడిచేతితో పట్టుకునే శంఖంలో శుభ్రమైన నీటిని నింపి.. దానిని ఇంటి చుట్టూ చల్లండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి శ్రేయస్సును తెస్తుంది.

లక్ష్మీదేవి చిత్రపటం: కమలంపై కూర్చుని.. ధన వర్షం కురిపిస్తున్నట్టుగా.. చేతుల నుంచి బంగారు నాణేలు జారిపోతున్నట్టుగా ఉన్న లక్ష్మీదేవి చిత్ర పటాన్ని తిజోరీలో లేదా భద్రపరిచే చోట ఉంచాలి. ఈ చిత్రంలో రెండు తొండాలు పైకెత్తిన ఏనుగులు ఉండటం లక్ష్మీ ఆశీస్సులు నిలిచి ఉండటానికి శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆచారాలు పాటిస్తే ఆర్థిక సంపద పెరుగుతుందని.. ధనానికి కొరత ఉండదని నమ్మకం ఉంటుందని పండితులు చెబుతున్నారు. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.  

ఇది కూడా చదవండి: రోజుకో పుస్తక పఠనం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం

Advertisment
తాజా కథనాలు