Dinner: రాత్రి పూట భోజ‌నం తినకపోతే ఏమవుతుంది?

రాత్రి భోజనం చాలా తేలికగా, శరీరానికి అవసరమైన పోషకాలు అందించేలా ఉండాలి. రాత్రి భోజనంలో జంక్ ఫుడ్‌, ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, ఫ్రోజెన్ ఐటమ్స్, మాంసాహారం వంటివి తప్పించాలి. ఇవి జీర్ణ, నిద్ర, వాపులు, అధిక బరువు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

New Update

Dinner: చాలామంది రాత్రి పూట భోజనాన్ని తినకుండా ఉంటారు. రోజంతా బిజీగా గడిపిన తర్వాత ఏదైనా తినేస్తే సరిపోతుందనుకునే వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు.. హోటళ్లలో బిర్యానీలు, మసాలా పదార్థాలు, స్వీట్లు, బయట చిరుతిళ్లు ఎక్కువగా తింటారు. కానీ రాత్రి పూట ఇలాంటి హెవీ ఫుడ్ తినడం శరీరానికి మేలు కాదు. నిజానికి రాత్రి భోజనం చాలా తేలికగా ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించేలా ఉండాలి. ఎందుకంటే రాత్రి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఉండదు. పైగా నిద్ర సమయంలో జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అలాంటప్పుడు మోతాదుకు మించి తినడం వల్ల ఫలితంగా అధిక బరువు, జీర్ణ సమస్యలు, డయాబెటిస్‌, గుండె జబ్బుల వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.

శరీరానికి తేలికగా..

రాత్రి భోజనంలో జంక్ ఫుడ్‌, ఎక్కువ నూనె ఉండే పదార్థాలు, ఫ్రోజెన్ ఐటమ్స్, మాంసాహారం వంటివి తప్పించాలి. ఇవి జీర్ణ సమస్యలతో పాటు నిద్రకు కూడా ఆటంకం కలిగించవచ్చు. వీటి బదులుగా తేలికపాటి, తక్కువ కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు అన్నానికి బదులుగా చపాతీలు తినడం మంచిది. పెరుగుకు బదులుగా మజ్జిగ తాగడం శరీరానికి తేలికగా ఉంటుంది. అలాగే రాత్రి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉంటుంది. ఇది వాపులు, అధిక బరువు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఉప్పును తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు రాత్రి భోజనంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇది కూడా చదవండి: వేసవిలో పిల్లల చర్మపై దద్దుర్లు ఎందుకు వస్తాయి..పరిష్కారం ఏంటి?

ఇవి జీర్ణానికి సహాయపడతాయి. రాత్రి చక్కెరను వాడకుండా తేనె వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే రాత్రి గోరువెచ్చని పాలను తాగితే శరీరానికి ఆహ్లాదంగా ఉంటుంది. పాలలో చక్కెర బదులుగా తేనె కలుపుకోవాలి. ఇది నిద్రకు సహాయపడుతుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం మూడుగంటల తర్వాతే నిద్రించాలి. దీనివల్ల ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. నిద్ర సరిగా పట్టి శరీరబరువు నియంత్రణలో ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది. గ్యాస్‌, అజీర్ణం, అలసట, అధిక బరువు వంటి సమస్యలు దరిచేరవు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చెమట వాసన ఇబ్బంది పెడుతుందా..ఇలా వదిలించుకోండి

dinner | dinner-time | late-night-dinner | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు