Coconut Water: కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుంది?

కొబ్బరి నీరు, నిమ్మకాయలో సహజమైన శక్తిని, శరీరాన్ని డిటాక్స్ చేసి రోగనిరోధక శక్తిని పెచుతుంది. కొబ్బరి నీటిలో సగం నిమ్మకాయ రసం కలపాలి. ఇందులో కొద్దిగా నల్లఉప్పు, పుదీనా కలిపి ఉదయం ఖాళీ కడుపుతో, భోజనం చేసిన గంట తర్వాత తాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.

New Update
lemon-juice  Coconut Water

lemon juice and Coconut Water

Coconut Water: వేసవిలో తీవ్రంగా పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నీరు, ఖనిజాలను కోల్పోతుంది. అలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్ చేసి చల్లగా ఉంచే పానీయాలు ఎంతో అవసరం. కొబ్బరి నీళ్లలో సహజమైన శక్తి, తక్కువ కేలరీలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ ఎనర్జీని అందించడమే కాకుండా పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజాలతో శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. 

శరీరాన్ని శక్తివంతంగా..

ఈ రెండు పదార్థాలను కలిపినప్పుడు అది ఒక సూపర్ డ్రింక్‌లా మారుతుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే సహజ చక్కెరలతో పాటు నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది. ఈ పానీయం చర్మాన్ని తేమగా ఉంచి మొటిమలు, పొడి స్థితిని తగ్గిస్తుంది. సహజ మెరుపును ఇస్తుంది. అంతేకాదు కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేసి ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గే వారికి కూడా ఇది మేలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: వేసవిలో బొప్పాయి ఎక్కువగా తినడం హానికరమా?

వేసవి కాలంలో తక్కువ కాలరీలతో శరీరానికి పూర్తి శక్తిని అందించాలంటే ఈ పానీయం ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. తయారీ కూడా చాలా సులభం. ఒక గ్లాసు తాజా కొబ్బరి నీటిలో సగం నిమ్మకాయ రసం కలపాలి. ఇందులో కొద్దిగా నల్లఉప్పు లేదా పుదీనా జోడిస్తే రుచి పెరుగుతుంది. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన గంట తర్వాత seగితే మంచి ఫలితాలు పొందవచ్చు. రోజువారీ జీవితంలో ఈ సహజ పానీయం ఒక శక్తివంతమైన ఆరోగ్య రహస్యంగా నిలుస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వ్యక్తి మరణించాక ఏయే అవయవాలను దానం చేయొచ్చు



( coconut-water | lemon-juice | health-benefits-of-lemon-juice | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news ) 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు