/rtv/media/media_files/2025/04/18/nBJcHsDrl3Go5UCBmlVi.jpg)
Talking phone meal
Health Tips: హిందూ శాస్త్రాలు, సంప్రదాయాల ప్రకారం.. రోజూ తీసుకునే ఆహారాన్ని దేవుని ప్రసాదంగా చెబుతారు. భోజనం చేస్తూ మాట్లాడటం దేవుడిని అవమానించినట్లే అని పెద్దలు అంటారు. అందుకే భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దలు చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తినడానికి కూర్చొంటారు. అంతేకాదు కబుర్లు చెప్పుకుంటూ తింటారు. భోజనం చేసేటప్పుడు మాట్లాడవద్దని, కూర్చోమని, భోజనం ముగించమని పెద్దలు మిమ్మల్ని తిట్టడం, సలహా ఇవ్వడం కొందరి ఇంట్లో ఇప్పటి వినే ఉంటారు. భోజనం చేసేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు..? దీని వెనుక కారణం ఏమిటి..? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మరణానికి దారితీయవచ్చు:
ఆహారం తినేటప్పుడు నోటిలోని లాలాజలం ఆహారంతో కలిసిపోయి. ఇది ఫుడ్‌ని జీర్ణం చేయడానికి ఎక్కువగా సహాయపడుతుంది. అయితే.. తినేటప్పుడు మాట్లాడితే ఆహారంతోపాటు గాలి కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియలో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి భోజనం చేసేటప్పుడు మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇలాంటి వారు తొందరపడి తిని మాట్లాడితే.. తినే ఆహారం గొంతులో ఇరుక్కుపోయే అవకాశం ఉంది. ఇది మరణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పెద్దలు నెమ్మదిగా తినాలని, భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని చెబుతారు.
ఇది కూడా చదవండి: ఈ వస్తువులను తాకిన వెంటనే చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు
అదనంగా తినేటప్పుడు మాట్లాడితే..నోటిలోని చిన్న ఆహార కణాలు, మిగిలిపోయినవి, బ్యాక్టీరియా ఇతరులపై పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఆరోగ్యం, పరిశుభ్రత కారణాల దృష్ట్యా, తినేటప్పుడు మాట్లాడకపోవడమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. మాట్లాడుతూ తింటే దృష్టి ఆహారం మీద కాకుండా వేరే చోట ఉంటుంది. దీనివల్ల ఆహార రుచిని ఆస్వాదించడం అసాధ్యం అవుతుంది మరియు సంతృప్తికరంగా తినడం అవుతుంది. కాబట్టి.. తినేటప్పుడు తినే ఆహారంపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం వలన ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )