Watch : రాహుల్ ది ఆల్రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా...!!
రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు.