/rtv/media/media_files/2025/04/17/FK4kZxUgm3YMo2CRHBTw.jpg)
Alcohol Sanitizers car
Car Tips: ఇటీవలి కాలంలో కదులుతున్న కార్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగుతున్న సంఘటనలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. కార్లు ఒక్కసారిగా అగ్ని గోళాలుగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలు కేవలం వాహనదారులను మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నవారిని కూడా ప్రమాదంలోకి నెట్టుతున్నాయి. ప్రమాదాలకు ప్రధాన కారణాలు నాణ్యతలేని విద్యుత్ వైరింగ్, ఇంధన లీకేజీలు, నకిలీ ఆఫ్టర్ మార్కెట్ ఫిట్టింగ్స్ అంటున్నారు. చాలామంది ఖర్చు తగ్గించేందుకు CNG కిట్లు, సౌండ్ సిస్టమ్‌లు వంటి ఉపకరణాలను నాణ్యత లేని చోట్ల నుంచి ఇన్ స్టాల్ చేయించుకుంటున్నారు.
కారులో మండే పదార్థాలు:
ఇది షార్ట్ సర్క్యూట్‌లకు దారితీస్తోంది. అంతేకాకుండా వేడిలో నిలిపిన కార్లలో ఉంచే పవర్ బ్యాంకులు, ల్యాప్ టాప్‌లు, శానిటైజర్‌లు, పెర్ఫ్యూమ్‌లు వంటి వస్తువులు కూడా ప్రమాదానికి దారితీయవచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతల్లో వేడెక్కి పేలిపోవడం, శానిటైజర్‌లు, పెర్ఫ్యూమ్‌లలో ఉండే ఆల్కహాల్ వల్ల స్పార్క్ వస్తే మంటలు వ్యాపించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. కాబట్టి కారులో మండే పదార్థాలు ఉంచకుండా జాగ్రత్త వహించాలి. విద్యుత్ వైరింగ్‌ను నిరంతర తనిఖీ చేయడం, ఇంధన వాసన వచ్చిన వెంటనే మెకానిక్‌ను సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి: అధిక బీపీ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందా..?
అంతేకాకుండా ఇంజిన్, ఎగ్జాస్ట్, రేడియేటర్ వంటి భాగాలను సకాలంలో సర్వీస్ చేయడం ఎంతో అవసరం. కారులో చిన్న అగ్నిమాపక యంత్రాన్ని ఉంచడంతో సకాలంలో పనికి వస్తుంది. వేసవి కాలంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేస్తూ ధూమపానం చేయడం, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం, బ్రేక్ లేదా క్లచ్‌లో మార్పు కనిపించినా దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఈ సాధారణ జాగ్రత్తలు పాటించటం ద్వారా కారులో మంటలు చెలరేగే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా.. ఒక్క క్షణం ఆలోచించండి
( car-tips-during-summer | latest-news)