Blood Donation: ఈ సమస్యలు ఉన్నవారు రక్తదానం అస్సలు చేయకూడదు

హెచ్‌ఐవీ, హెపటైటిస్, క్యాన్సర్‌, క్షయ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయవద్దు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, తక్కువ లేదా అధిక బీపీ ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు. టాటూ, బాడీ పియర్సింగ్‌ చేసినవారు 6 నెలలు గడిచిన తర్వాతే రక్తదానం చేయాలి.

New Update

Blood Donation: రక్తదానం ఎంతో గొప్పది, మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే రక్తదానం మహా దానం అనే పదం వచ్చింది. రక్తదానం ప్రతి ఒక్కరు చేయగల పనిగానే కనిపించినా దీన్ని చేసేటప్పుడు కొన్ని ఆరోగ్య ప్రమాణాలను పాటించడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఇవ్వాలంటే దాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి. దాత బరువు కనీసం 50 కిలోలు ఉండాలి. వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12.5 గ్రా/డీఎల్ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 37.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. పల్స్‌ రేట్ 50 నుంచి 100 మధ్య ఉండాలి. డయాస్టోలిక్ బీపీ 50 నుంచి 100 మధ్యగా, సిస్టోలిక్ బీపీ 100 నుంచి 180 మధ్యగా ఉండాలి.

కిడ్నీ వ్యాధులు ఉన్నవారు..

ఈ ప్రమాణాలన్నీ దాత ఆరోగ్యంగా ఉందా లేదాని నిర్ధారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోగ్యవంతుడు అయితే ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చు. ఎందుకంటే శరీరం స్వయంగా కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. కానీ కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు రక్తం ఇవ్వకూడదు. హెచ్‌ఐవీ, హెపటైటిస్, క్యాన్సర్‌, క్షయ, గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయరాదు. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, తక్కువ లేదా అధిక బీపీ ఉన్నవారు కూడా రక్తం ఇవ్వడం సరికాదు. టాటూ లేదా బాడీ పియర్సింగ్‌ చేసినవారు కనీసం 6 నెలలు గడిచిన తర్వాతే రక్తదానం చేయాలి.

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

అలాగే వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా ఆ వ్యాక్సిన్ రకానికి అనుగుణంగా 1 నెల నుంచి 6 నెలల వరకు దూరంగా ఉండాలి. మద్యం సేవించిన వారు కనీసం 24 గంటలు గడిచాక మాత్రమే రక్తం ఇవ్వాలి. రీసెంట్‌గా దంత చికిత్స లేదా శస్త్రచికిత్స చేసినవారు కూడా రక్తం ఇవ్వకుండా కొన్ని రోజులు గడపాలి. అబార్షన్ అయిన మహిళలు కనీసం 6 నెలల పాటు రక్తదానం చేయరాదు. ఫిట్స్‌, తీవ్రమైన అలర్జీలు ఉన్నవారు కూడా రక్తం ఇవ్వరాదు. ఈ ప్రమాణాలన్నింటిని పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎంతో మందికి జీవాన్ని అందించగలుగుతాం. ఈ సేవ మనకు సమాజ పట్ల ఉన్న బాధ్యతను నెరవేర్చే మార్గంగా నిలుస్తుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

( blood-donation | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు