/rtv/media/media_files/2025/09/01/black-spots-on-the-neck-2025-09-01-07-28-40.jpg)
Black Spots Neck
మెడ చుట్టూ నల్లటి మచ్చలు లేదా నలుపు రంగు సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ.. ఇది కొన్నిసార్లు శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం కావచ్చు. మెడపై నల్లటి చారలు లేదా వలయాలు ఏర్పడటం ప్రారంభమైతే.. దానిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇది శరీరంలో జరుగుతున్న ఆరోగ్య సంబంధిత సమస్యకు సూచన కావచ్చు. దానిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం చాలా అవసరం. చాలామంది తమ ముఖ సౌందర్యంపై దృష్టి పెడతారు కానీ మెడపై శ్రద్ధ పెట్టరు. ముఖ చర్మంతో పోలిస్తే మెడ చర్మం మరింత సున్నితంగా ఉంటుంది. దీనిపై పేరుకున్న ధూళి, చెమట, మురికి సులభంగా నలుపు రంగులోకి మారుస్తాయి. కొన్నిసార్లు ఈ మార్పు కేవలం బయటి కారణాల వల్ల సంభవిస్తుంది. కానీ కొన్నిసార్లు ఇది శరీరంలో జరుగుతున్న పెద్ద మార్పులకు సంకేతం కావచ్చు. మెడపై నల్లటి మచ్చలు తొలగించే చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
మెడ నల్లబడటానికి కారణాలు:
మెడ చర్మం సున్నితంగా ఉండటం వల్ల దీనిపై దుమ్ము, చెమట, మురికి పేరుకుపోయి నలుపు రంగు వస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారం అయినా జంక్ ఫుడ్, ఎక్కువ చక్కెర తీసుకోవడం చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇది కూడా మెడ నల్లబడటానికి కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల మెడపై నలుపు రంగు పెరుగుతుంది. అంతేకాకుండా మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారిలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలు, అధిక ఇన్సులిన్ స్థాయిలు మెడ నల్లబడుతుంది. ఈ పరిస్థితిలో శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ఒక తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఒక్క వెజిటబుల్.. రెండు ప్రయోజనాలు!!
దీనివల్ల కూడా మెడ నల్లబడటం గమనించవచ్చు. అయితే మెడపై నలుపు రంగుతో సంబంధం ఉన్న వ్యాధులు ఉన్నాయి. మెడ చుట్టూ నల్లటి వలయం మధుమేహం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి సమస్యలకు సంకేతం కావచ్చు. PCOS సమస్యతోపాటు ఇతర హార్మోన్ల అసమతుల్యతలు మెడపై నలుపు రంగుకు కారణం కావచ్చని చెబుతున్నారు. శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగితే ఇది కూడా మెడ నల్లబడటానికి దారితీస్తుంది. ఇది చర్మంపై నల్లటి పొర ఏర్పడటం వల్ల మెడ నల్లబడేలా చేస్తుంది. ఊబకాయం, మధుమేహం లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇది సంభవించవచ్చు. ఊబకాయం మెడ నలుపుకు ఒక ప్రధాన కారణం. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం అవసరం. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కరకరలాడే క్రిస్పీ కార్న్ రెసిపీ.. ఇప్పుడే తెలుసుకోండి