/rtv/media/media_files/2025/01/19/JQ04XZyMG7z3jYAVFDkD.jpg)
Black Cumin Photograph: (Black Cumin)
అందరిలో అందంగా ఉండటంతో పాటు చర్మం మెరవాలని ఎక్కువగా అమ్మాయిలు కోరుకుంటారు. దీనికోసం మార్కెట్‌లో ఉండే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటి వల్ల చర్మం దెబ్బతింటుంది. అదే వంటింట్లో ఉండే పదార్థాలతో చిన్న చిట్కాలు పాటిస్తే ఈజీగా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మం అందంగా మెరవడానికి నల్లజీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు చర్మంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
మొటిమలు, మచ్చలు లేకుండా..
నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అయితే ఈ నల్ల జీలకర్రను పేస్ట్ చేసి చర్మానికి అప్లై చేయడమే కాకుండా నూనె కూడా రాయవచ్చు. అయితే చర్మానికి మంచిదని ఎక్కువగా వీటిని అప్లై చేయవద్దు. వారానికి కేవలం ఒకసారి మాత్రమే చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
నల్ల జీలకర్ర వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటి పొడి లేదా వాటర్‌ను తాగడం వల్ల క్యాన్సర్, గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు రక్తంలో కొలెస్ట్రాలు స్థాయిలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వాటర్ రోజూ తాగడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, పేగు సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!