/rtv/media/media_files/2025/10/09/diwali-2025-2025-10-09-11-26-21.jpg)
Diwali 2025
దేశమంతటా ఆనందోత్సవాలతో జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి 2025 తేదీపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 20న జరుపుకోవాలా, లేక 21న జరుపుకోవాలా అనే సందేహం ప్రజలను వేధిస్తోంది. ముఖ్యంగా కార్తీక అమావాస్య తిథి రెండు రోజులు ఉండటం ఈ అయోమయానికి కారణమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం దీపావళి తేదీ గురించి పంచాంగాలలో తేడాలు కనిపిస్తుండటంతో.. ఈ విషయంలో నివృత్తి కోసం వారణాసికి చెందిన పండితులను సంప్రదించారు. దీపావళి అక్టోబర్ 20 లేదా 21న ఎప్పుడు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
గందరగోళానికి శుభ సమయం..
జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం.. ఈ తేదీ శుభ సమయంపై స్పష్టత ఇచ్చారు. దీపావళి పండుగను కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటామని తెలిపారు. క్యాలెండర్ ప్రకారం.. కార్తీక అమావాస్య తిథి అక్టోబర్ 20న తెల్లవారుజామున 3:44 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అక్టోబర్ 21 తెల్లవారుజామున 5:53 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ఇతర పండుగలను సూర్యోదయం తిథిని బట్టి నిర్ణయిస్తారు. కానీ దీపావళి పూజను రాత్రి వేళ, అమావాస్య తిథిలో నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: చిన్నారుల్లో జలుబు, దగ్గుకు చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు !!
పండితుల వివరణ ప్రకారం.. అక్టోబర్ 20న అమావాస్య తిథి అర్థరాత్రి వరకు ఉంటుంది. ఈ రోజున ప్రదోష కాలం కూడా లభిస్తోంది. ఇది లక్ష్మీదేవి పూజకు చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. అక్టోబర్ 21న అమావాస్య తిథి ఉన్నప్పటికీ.. ఆ రోజున ప్రదోష కాలం లభించడం లేదు. అందువల్ల.. శాస్త్రాల ప్రకారం.. అక్టోబర్ 20న దీపావళి పండుగను జరుపుకోవడం సరైనదని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ దీపావళికి లక్ష్మీ గణేశ పూజకు అక్టోబర్ 20న రాత్రి 7:12 నుంచి 8:40 వరకు అత్యంత శుభ సమయంగా చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా రాత్రి 9:10 నుంచి 10:15 వరకు కూడా పూజ చేసుకోవచ్చు. ఈ రెండు సమయాలు పూజకు శుభప్రదమని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. పూర్తి వివరాలకు సంబంధిత పండితులను సంప్రదించండి!
ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన గుండె కోసం రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఈ పండ్లు చేర్చుకోండి