Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఆరు వ్యాధులకు చెక్!

అర్జున్‌ చెట్టు బెరడు మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధ గని. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున్‌ బెరడు నీటిని తాగితే గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి.. ఎముకలు, కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

New Update
Arjun Bark Water

Arjun Bark Water

అర్జున్‌ బెరడు చెట్టును టెర్మినాలియా అర్జున్‌ అని అంటారు. ఇది ఆయుర్వేద వైద్యంలో ఒక శక్తివంతమైన ఔషధంగా ప్రసిద్ధి చెందింది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రథమంగా ఉపయోగపడుతుంది. ఈ బెరడులో టానిన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు, ట్రైటెర్పెనాయిడ్ సపోనిన్‌లు వంటి జీవక్రియాశీల సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె జబ్బులు ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తున్నారు. అర్జున్‌ చెట్టు బెరడు మనకు అందుబాటులో ఉండే అద్భుతమైన ఔషధ గని.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున్‌ బెరడు నీటిని తాగితే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు ముఖ్యంగా గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ మరియు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. గుండెకు రక్షణ కవచంలా పనిచేసే ఈ అర్జున్‌ బెరడు గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

గుండె ధమనాలను శుభ్రంగా ఉంచి..

అర్జున్‌ బెరడు నీటి(Arjun Bark Water) లోని సహజ గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ధమనులలో అడ్డుకట్టలను నివారిస్తాయి. ఇది గుండెను పటిష్టం చేసి గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి కూడా ఇది ఒక వరమని చెప్పవచ్చు. ఇందులో ఉండే పొటాషియం మరియు టానిన్లు రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడి స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా అర్జున్‌ బెరడు నీరు సహాయపడుతుంది. ఇది గుండె ధమనాలను శుభ్రంగా ఉంచి అడ్డుకట్టలు ఏర్పడకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మీ కిడ్నీలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి!

మధుమేహం(Diabetes) ఉన్నవారికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇది ఎముకలు, కీళ్ల నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం మరియు మెగ్నీషియం ఎముకలను బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే కీళ్ల నొప్పుల లక్షణాలు కూడా తగ్గుతాయి. అంతేకాక దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి వృద్ధాప్య ఛాయలను అరికట్టడంలో సహాయపడతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు అర్జున్‌ బెరడు నీరు తాగడం అలవాటు చేసుకుంటే అనేక వ్యాధులకు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: చెవుల నుంచి నీరు వస్తుందా..? ఈ కారణాలు..చికిత్స తెలుసుకోండి

best-health-tips | latest health tips | health tips in telugu | latest-telugu-news | healthy life style | daily-life-style | human-life-style

Advertisment
తాజా కథనాలు