Asafoetida: కూరల్లో ఇంగువ వాడుతున్నారా.. దాని లాభాలు తెలుసా?

ఇంగువ వాడకంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో, బ్రాంకైటిస్‌, దగ్గు, ఆస్తమా వంటి సమస్యను తగ్గించడంలో ఇంగువ కీలక పాత్ర పోషిస్తుంది.

New Update

Asafoetida: ఇంగువను భారతీయ వంటల్లో తరాలుగా వాడుతున్నారు. కానీ దీని వాడకంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు గురించి చాలామందికి అవగాహన ఉండదు. శ్వాసకోశం, మహిళల ఆరోగ్యం నుంచి నొప్పుల నివారణ వరకు ఇంగువ అనేక వైద్య గుణాలను కలిగి ఉంటుంది. పొట్ట సమస్యల్ని తగ్గించడంలో ఇంగువ బాగా పనిచేస్తుంది. ఇంగువలో ఉండే సహజ సుగంధ పదార్థాలు, ఫైటోకెమికల్స్ గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, కడుపులో వాయువు, బలహీన జీర్ణశక్తి వంటి సమస్యలను తగ్గిస్తాయి. దీనివల్ల పేగుల పనితీరు మెరుగవుతుంది.

ఆస్తమా నుంచి ఉపశమనం:

ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉండటం వల్ల పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో ఇంగువ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మ్యూకస్‌ను కరిగించే గుణాన్ని కలిగి ఉంది. దీంతో బ్రాంకైటిస్‌, దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో లేదా వాతావరణ మార్పుల సమయంలో ఇంగువను తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇంగువ ప్రయోజనకరంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో ఏర్పడే నొప్పులు, అధిక రక్తస్రావం వంటి సమస్యలను తక్కువ చేయడంలో ఇది సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: పెదవులు తరచుగా ఎండిపోతుంటే ఈ లోపం ఉన్నట్టే

ఇది హార్మోన్‌ల సమతుల్యతను కొంతవరకు కాపాడగలదు. అందువల్ల సంతానలేమి వంటి సమస్యల పరిష్కారంలో ఇంగువ తీసుకుంటే ఫలితం ఉంటుంది. నొప్పుల నివారణకూ ఇంగువ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దంత నొప్పి లేదా చెవి నొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది. కొద్దిగా ఇంగువను నీటిలో కలిపి పుక్కిలిస్తే దంత నొప్పి తగ్గుతుంది. చెవిలో వాపు లేదా నొప్పి ఉంటే కొబ్బరినూనెతో కలిపిన ఇంగువను రెండు చుక్కలు వేసినా ఉపశమనం లభిస్తుంది. ఇంగువను అధిక మోతాదులో తీసుకోవడం కాకుండా సరైన పరిమితిలో వాడాలని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు