TTD: తిరుమలలో మరోసారి అపచారం.. ఇద్దరు ఉద్యోగులపై వేటు?
కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. టీటీడీలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.