Allu Arjun: అల్లు అర్జున్ తలుపు తట్టిన మరో స్టార్ డైరెక్టర్..! సూపర్-హీరో ప్రాజెక్ట్..?

లోకేష్ కనగరాజ్ సై-ఫై సినిమా ‘ఇరుంబు కై మాయావి’ కోసం అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ కథ విన్నప్పటికీ ఇంకా ఒప్పుకోలేదు. ముందుగా సూర్యతో చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం బన్నీ అట్లీ చిత్రంలో బిజీగా ఉన్నారు.

New Update
Allu Arjun

Allu Arjun

Allu Arjun: ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ త్వరలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తో కలిసి పని చేయబోతున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో మరోసారి గట్టిగా వినిపిస్తున్నాయి. లోకేష్ చాలా ఏళ్లుగా ప్లాన్ చేస్తున్న సైంటిఫిక్ యాక్షన్ సినిమా ‘ఇరుంబు కై మాయావి’ కోసం అతడు అల్లు అర్జున్‌ను సంప్రదించినట్లు సమాచారం. చర్చల ప్రకారం, బన్నీ కథ విన్నప్పటికీ ఇంకా అధికారికంగా అంగీకారం ఇవ్వలేదట. ఈ ప్రాజెక్ట్ మీద వచ్చిన ఊహాగానాలు ఇప్పుడు మరింత పెరిగాయి.

ఈ సినిమాకు మొదట హీరోగా సూర్యను ఎందుకునేలా లోకేష్ ప్లాన్ చేశారు. అయితే తెలియని కారణాల వలన ఆ వెర్షన్ ఆగిపోయింది. తర్వాత లోకేష్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయ్యారు, దీని వలన ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్టే అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బయటకు రావడంతో ప్రాజెక్ట్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

అల్లు అర్జున్ - అట్లీ (Allu Arjun Atlee)

అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాతో బిజీగా ఉన్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బన్నీ ఒకే కుటుంబానికి చెందిన నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని వార్తలు ఉన్నాయి. దీపికా పదుకోన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

లోకేష్ - ‘ఇరుంబు కై మాయావి’ ఎందుకు ఆలస్యం?

లోకేష్ కనగరాజ్ ఇటీవల రజనీకాంత్‌తో చేసిన ‘కూలీ’ తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఇరుంబు కై మాయావి’ కథను నేను 10 ఏళ్ల క్రితమే రాసుకున్నాను. ఆ కథలోని చాలా అంశాలను నా ఇతర సినిమాల్లో ఇప్పటికే వాడేశాను. ఇప్పుడు అదే కథను మళ్లీ రాస్తే అది పూర్తిగా మారిపోతుంది. కానీ ఆ సినిమా యాక్షన్ విషయంలో చాలా ప్రత్యేకం,” అని చెప్పారు. అంటే ఈ సినిమా ఇంకా చేయాలనే ఆసక్తి దర్శకుడికి ఉన్నప్పటికీ, పూర్తిగా కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇంతలో లోకేష్ తన ఏడవ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించారు. ఇది ఆయన తొలి తెలుగు చిత్రం అయ్యే అవకాశం ఉందని వినికిడి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. హీరోగా కూడా కనిపించనున్న లోకేష్.. దర్శకుడు మాత్రమే కాదు, ఇప్పుడు నటుడిగానూ లోకేష్ కనిపించబోతున్నారు. ఆయన అరణ్ మైత్రేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘DC’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వామికా గబ్బీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

మొత్తంగా, అల్లు అర్జున్ - లోకేష్ కాంబినేషన్ నిజమైతే, ఇది దక్షిణ భారత సినిమా ప్రపంచంలో భారీ హైప్ తెప్పించే ప్రాజెక్ట్ అవుతుంది. అభిమానులు మాత్రం ఈ వార్తపై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు