Putin Net Worth: సముద్రం మీద సీక్రెట్ బిల్డింగ్, కోట లాంటి రైలు.. పుతిన్ ఆస్తి ఎంతో తెలుసా?

ప్రపంచ దేశాధినేతల్లో అత్యంత శక్తిమంతుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఈయన అత్యంత ధనవంతుడు కూడా. పుతిన్ జీవనశైలి చాలా కాస్ట్లీగా ఉంటుందని అంటారు. సోషల్ మీడియాలో దొరికిన సమాచారం ప్రకారం ఆయన సంపద వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
putin

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక కఠినమైన నేత. ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండాలనుకుంటారు. ప్రపంచంలో తన కంటే ఎవరూ గొప్పకాదన్నట్టు ప్రవర్తిస్తారు. ఎవరైనా తాను చెప్పింది వినాల్సిందే తప్ప, తాను ఎవరి మాటా వినను అన్నట్టు వ్యవహరిస్తారు. అలాంటి పుతిన్ తో భారత దేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి. పుతిన్ , భారత ప్రధాని మోదీ మంచి స్నేహితులు. ఇద్దరు దేశాధినేతలూ...రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగడంలో కృషి చేశారు. ఇందులో భాగంగానే పుతిన్ ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

నిజానికి రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత జీవితం, సంపదల గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. తెలుసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వరు. ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితం గురించి రహస్యంగానే ఉంచాలని ఆయన అనుకుంటారు. పుతిన్ గురించి మరింత సమాచారం బయటపడే కొద్దీ, అతను మరింత రహస్యంగా మారతారని చెబుతుంటారు. ఫార్చ్యూన్మ్యాగజైన్ ప్రకారం...అధికార పత్రాలలో పుతిన్ తాను కేవలం ఒక ప్రభుత్వాధికారిగానే చెప్పుకున్నారు. కానీ ఆర్థిక నిపుణులు అతన్ని భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరని చెబుతారు. పుతిన్ సంపద దాదాపుగా 200 బిలియన్ డాలర్లు అని అంచనా వేయబడింది. అయితే ఆయన పేరు మీద మాత్రం ఎటువంటి ఆస్తులూ లేవు. ఎక్కడా ఆ రకంగా చూపించబడలేదు. అందుకే ఆయన్ను బిలియనీర్ల జాబితాలో చేర్చలేదు.

నల్ల సముద్రంపై అద్భుతమైన ప్యాలెస్..కదిలే కోట..

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నల్ల సముద్రంపై అత్యంత ఖరీదైన ఫ్యాలెస్ ఉందని తెలుస్తోంది. వందల ఎకరాల్లో ఇది విస్తరించబడి ఉంటుంది. ఇదొక రాజభవనంలో ఉంటుందని చెబుతున్నారు. విశాలమైన గదులు, ఇటాలియన్ అలంకరణ, థియేటర్ హాల్, స్పా, వైన్ రూమ్ మరియు భూగర్భ మార్గాలతో, ఇది ఆధునిక యుగంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా నిలుస్తోంది. దీని విలు బిలియన్ డాలర్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇదే కాదు పుతిన్ కు ఒక కదిలే కోట కూడా ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రత్యేక రైలు. ఇది బయట నుంచి చాలా మామూలుగా కనిపిస్తుంది. కానీ లోపలకు వెళితే కళ్ళు చెదిరిపోవడం ఖాయం అనిఅంటారు. ఇందులో జిమ్ నుంచి స్పా వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే దీని భద్రతా సాంకేతిక కూడా అత్యంత ఆధునికంగా ఉంటుంది. ఎలాంటి ముప్పును అయినా ఈ రైలు ఎదుర్కోగలదు.

ఫ్లైయింగ్ క్రెమ్లిన్..

ఇక పుతిన్ ప్రయాణించే విమానాల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. దాన్ని ఫ్లైయింగ్క్రెమ్లిన్అని పిలుస్తారు. విమానంలో అచ్చంగా ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది. ఇవే కాకుండా పుతిన్ దగ్గర చాలా విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా చాలా ఉన్నాయని చెబుతారు. పుతిన్ కు కార్లను, వాచీలను సేకరించే అలవాటు ఉందని తెలుస్తోంది. ఆయనకున్న వాచీల్లో మిలియన్ల డాలర్ల విలువైనవి కూడా ఉన్నాయి. ఇక రష్యా అధ్యక్షుడు తన భద్రత కోసం రష్యా లోపల, బయట కూడా చాలా రహస్య సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. వీటి భూగర్భంలో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించారని..అత్యాధునిక నిఘా సాంకేతికత అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు