Paper leakage: నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బిగ్ ట్విస్ట్.. హైకోర్టులో బాధిత స్టూడెంట్ పిటిషన్!
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు కు చేరింది. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థిని ఝాన్సీలక్ష్మి హైకోర్టు ను ఆశ్రయించింది.