TS: వరంగల్ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
ts

Warngal Air port

ఎట్టకేలకు వరంగల్ లో ఎయిర్ పోర్ట్ రానుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులను కేంద్రం ఇచ్చింది. మామునూరులో ఎయిర్ పోర్ట్ ఆపరేషన్లు నిర్వహించొచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్​పోర్ట్​ ఉండకూడదని  జీఎంఆర్‌‌ సంస్థతో ఒప్పందం ఉంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి పౌర విమానయానశాఖతో చర్చించారు. గత నెల 25న ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా  చైర్మన్​ కు లేఖ రాసింది. దీనిని హెచ్ఏఎల్ కు పంపారు. అక్కడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడంతో మామనూరు ఎయిర్ పోర్ట్ కు కేంద్రం అనుమతినిచ్చింది. 

ts
Warangal Airport

ఇప్పుడు తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ లో ఎయిర్ పోర్ట్ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 253 ఎకరాల భూ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌కు సంబంధించి రూ.205 కోట్లను ఇప్పటికే ఏఏఐకి అంద‌‌‌‌‌‌‌‌జేశారు. వరంగల్ తో పాటూ భ‌‌‌‌‌‌‌‌ద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ లో విమానాశ్రయాలను మంజూరు చేయాల‌‌‌‌‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. అయితే మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్ ఎయిర్ పోర్ట్ కు మాత్రం చకచకా అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ కూడా చేశారు. 

ts
Minister Ram Mohan Naidu

Also Read: Dwaraka : కల వచ్చిందని శివలింగం దొంగతనం..వీడిన ద్వారకా మిస్టరీ

Advertisment
Advertisment
తాజా కథనాలు