🔴LIVE BREAKINGS: యూకేకు పక్కలో బళ్ళెంలా చైనా.. అక్కడే గూఢచర్య కేంద్రం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
యూకేకు పక్కలో బళ్ళెంలా చైనా.. అక్కడే గూఢచర్య కేంద్రం
లండన్‌లో చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం లండన్‌కు పక్కలో బళ్ళెంలా తయారైంది. దీంతో ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా పోతుందట. దీనికి కారణం టవర్ లండన్ సమీపంలోని రాయల్ మింట్ వద్ద ఇది ఉండటమేనని చెబుతున్నారు.
Jul 06, 2025 11:19 IST
యుద్ధం తర్వాత మొదటిసారి బయటికొచ్చిన ఖమేనీ..
యుద్ధం జరిగినప్పటినుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన బయటికొచ్చారు. శనివారం సెంట్రల్ టెహ్రాన్‌లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు.
Khamenei
Jul 06, 2025 11:19 IST
హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, హత్యచేసిన భర్త
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లోని బోరబండలో ఆమానవీయ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను వివస్త్ర చేయడంతో పాటు గుండు చేయించి మరి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. బోరబండలోని సాయిబాబానగర్‌లో భార్యను భర్త నర్సింహులు దారుణంగా హత్య చేశాడు.
Jul 06, 2025 09:43 IST
ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లెలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ తెల్లవారుజామున చెట్టుకు వేలాడుతూ వారి మృతదేహాలు కనిపించాయి.
Jul 06, 2025 09:42 IST
ట్రైన్ లో నా బూ*బ్స్ పట్టుకొని లాగాడు ..హీరోయిన్ సంచలన వీడియో వైరల్!
బుల్లితెర నటి అదితి పోహంకర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను ఫేస్ చేసిన సెక్సువల్ అబ్యూజింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు సేఫ్టీ చాలా తక్కువ! ఎవరు ఎక్కడ చేయి వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని తెలిపింది.
టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు
అగ్రరాజ్యం అమెరికా తుఫాన్ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు.
Jul 06, 2025 09:40 IST
రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం
Jul 06, 2025 08:13 IST
భారత్‌లో తగ్గిన పేదరికం.. సమానత్వంలో 4వ స్థానం: ప్రపంచ బ్యాంక్
భారత్‌లో అసమానతలు తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. దేశ ఆదాయం, సంపదను కొలిచే గినీ ఇండెక్స్‌లో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాల తర్వాత భారత్ 25.5 స్కోర్‌తో నాలుగో స్థానంలో నిలిచిందని పేర్కొంది.
India becomes fourth ‘most equal’ country globally
Jul 06, 2025 07:47 IST
జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలిక దారుణ హత్య - గొంతు కోసి
జగిత్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల గ్రామంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పక్కనే ఉన్నా విజయ్ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
Jul 06, 2025 07:46 IST
బిగ్ అలర్ట్ - తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
వాతావరణ కేంద్రం తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రుతుపవనాల వల్ల ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Ponguleti Srinivasa reddy
Jul 06, 2025 07:44 IST
ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్‌మస్క్..కొత్త పార్టీ ప్రారంభం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పనిచేశాడు. ఇన్నాళ్లు కేవలం ట్రంప్‌ను తన దారికి తెచ్చుకునేందుకు మాత్రమే కొత్త పార్టీ నినాదం ఎత్తుకున్నాడని భావిస్తూ వస్తున్నఎలాన్ మస్క్ ట్రంప్ కు షాక్ ఇస్తూ ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేశారు.