/rtv/media/media_files/2025/07/06/india-becomes-fourth-most-equal-country-globally-2025-07-06-08-04-02.jpg)
India becomes fourth ‘most equal’ country globally
భారత్‌లో అసమానతలు బాగా తగ్గాయని ప్రపంచబ్యాంక్ ప్రకటించింది. 2011-12 నుంచి 2022-23 వరకు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం.. భారత్‌లో 2011-12 కాలంలో 16.2 శాతంగా ఉన్న 'అత్యంత పేదరికం' 2022-23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయింది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల ఇలాంటి మార్పు సాధ్యమైందని రిపోర్ట్ తెలిపింది. సమానత్వం విషయంలో స్లోవాక్ రిపబ్లిక్ (24.1), స్లోవేనియా (24.3), బెలారస్ (24.4) దేశాలు మొదటి మూడు స్థానాలు సొంతం చేసుకున్నాయి.
Also read: బాగా దోచేశారు.. 1గోడకు లీటర్ పెయింట్.. 233 మంది పెయింటర్స్.. బిల్లు తెలిస్తే షాకే!!
Also Read : ఇండోనేషియాలో వరుస భూకంపాలు.. వణికిపోతున్న ప్రజలు
India Becomes Fourth ‘Most Equal’ Country
గినీ ఇండెక్స్ స్కోర్‌లో చైనా, అమెరికా, బ్రిటన్ కన్నా భారత్ మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. 25.5 స్కోర్‌తో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానాన్ని దక్కించుకొని అత్యత్తమ సమానత్వ దేశంగా నిలిచినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమానస్థాయిలో పంపిణీ అవుతోందనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్ స్కోర్ లెక్కిస్తారు. ఈ ఇండెక్స్ స్కోర్ సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు. 98 స్కోర్ వస్తే ఆ దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు అందరూ కటిక పేదరికంలో ఉన్నట్లు అర్థం.
Also read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ
ప్రపంచ బ్యాంక్ 167 దేశాల గినీ ఇండెక్స్ స్కోర్‌ను ప్రకటించింది. ఇందులో చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. భారత్ 25.5 స్కోర్‌తో వాటికన్నా మెరుగైన స్థానాన్ని సాధించింది. ఈ రిపోర్టు ప్రకారం భారత్‌లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు రేఖ నుంచి బయటపడ్డారు. ఇక తక్కువ అసమానతల కేటగిరీలో చూసుకుంటే దాదాపు 30 దేశాలు ఉన్నాయి. వీటిలో ఐస్‌ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, పోలండ్ లాంటి యూరప్ దేశాలు కూడా ఉన్నాయి. అలాగే యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఉంది.
Also Read : ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర షురూ
world-bank | rtv-news