USA: టెక్సాస్‌లో వరదల బీభత్సం..43 మంది మృతి.. 23 మంది బాలికల గల్లంతు

అగ్రరాజ్యం అమెరికా తుఫాన్‌ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్‌ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్‌ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు.

New Update
43 People Killed In Texas Due To Storms And Flooding

43 People Killed In Texas Due To Storms And Flooding

 USA:  అగ్రరాజ్యం అమెరికా తుఫాన్‌ తాకిడికి చిగురుటాకుల వణికింది. తుఫాన్‌ సృష్టించిన బీభత్సంతో టెక్సాస్‌ వరదలతో అతలాకుతలం అయ్యింది. ఆకస్మిక వరదలతో గ్వాడాలుపే నదికి వరదలు పోటెత్తాయి. దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగుల మేరకు వరద పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరదల మూలంగా తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరానికి వెళ్లిన 23 మంది బాలికలతో పాటు 27 మంది గల్లంతయ్యారు. సెంట్రల్ టెక్సాస్ మీదుగా తుఫాను  కదులుతుండటంతో మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్‌ వెల్లడించింది.

Also Read: Pawan Kalyan - Mahesh Babu: పవన్, మహేశ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ఒకే థియేటర్‌లో రెండు ట్రీట్‌లు!

43 People Killed In Texas Due To Storms And Flooding

వరదల ప్రభావం వేసవి శిక్షణా శిబిరాలపై పడింది. మిస్టిక్‌ క్యాంప్‌ వేసవి శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది. ఇక్కడ 750 మంది పిల్లలు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా వరద పోటెత్తడంతో శిక్షణలో ఉన్న పలువురు బాలికలు గల్లంతయ్యారు. తప్పిపోయిన బాలికల కోసం సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.  ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. సుమారు 23 మంది బాలికల ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సెంట్రల్ కెర్ కౌంటీలో రాత్రిపూట 25 సెం.మీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముచ్చేత్తాయి. పడవలు, హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టెక్సాస్‌లోని కెర్ కౌంటీలో తీవ్ర వరదల్లో చిక్కుకున్న 800 మందికి పైగా ప్రజలను రక్షించారు.

Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?

కాగా, ఇంకా చాలామంది వరదల్లో చిక్కుకున్నారని, వారిని కూడా రక్షించే చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. రెండవ రోజు కూడా ఆపరేషన్‌ కొనసాగుతుందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తొమ్మిది రెస్క్యూ బృందాలు, 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెంట్రల్ టెక్సాస్‌లో వరదలను “విపత్తు”గా అభివర్ణించారు. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. దక్షిణ-మధ్య టెక్సాస్ హిల్ కంట్రీలోని కెర్ కౌంటీలోని కొన్ని ప్రాంతాలకు యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరఖ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: ఇది గనుక పాలల్లో కలిపి తాగితే ఎముకలు ఉక్కులా తయారవుతాయి

Also Read :  ఎములాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు..

america floods | flood water | flood | hail-storms | storms | north texas weather | texas

Advertisment
Advertisment
తాజా కథనాలు