/rtv/media/media_files/2025/07/06/chinese-embassy-2025-07-06-13-13-30.jpg)
Chinese Embassy
China: సాధారణంగా ఒక దేశంలో ఉండే దౌత్యకార్యాలయం (ఎంబసీ) అంటే ఆ దేశంలో మరో దేశపు రాయబారుల కోసం కేటాయిస్తారు. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపార, ఆర్థిక, సామాజిక ఇతర సంబంధాలను బలపర్చుకోవడానికి ఈ కార్యాలయాలు ఉపకరిస్తాయి. కానీ, లండన్‌లో మాత్రం చైనా నిర్మించాలనుకుంటున్న భారీ దౌత్య కార్యాలయం లండన్‌కు పక్కలో బళ్ళెంలా తయారైంది. దీంతో ఆ దేశానికి కంటిమీద కునుకు లేకుండా పోతుందట. దీనికి కారణం టవర్ లండన్ సమీపంలోని రాయల్ మింట్ వద్ద ఇది ఉండటమేనని చెబుతున్నారు. నిజానికి లండన్‌లో చైనా నిర్మించతలపెట్టిన కార్యాలయానికి గతంలో అనుమతులు నిలిపివేసింది. యూకే నిఘా సంస్థ ఎంఐ5, స్కాట్లాండ్ యార్డ్ హెచ్చరించడంతో అనుమతులు ఆపేశారు. కానీ, ప్రభుత్వం మారడంతో తిరిగి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read : మహిళామణులకు గుడ్‌న్యూస్.. విజయదశమికి వారికి చీరల పంపిణీ
లండన్ ఫైనాన్షియల్ సెంటర్ కు సమీపంలో సమీపంలో చైనా దౌత్యకార్యాలయం నిర్మించడంపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా ప్రధాన మంత్రి కార్యాలయానికి అభ్యంతరాలను పంపింది. అతి సున్నితమైన ఫైనాన్సియల్ సెంటర్ సమీపంలో నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక చైనా నిర్మించతలపెట్టిన కార్యాలయంలో బేస్‌మెంట్ సూట్లు, సొరంగం ఉన్నట్లు కూడా గతంలో వార్తలొచ్చాయి. చైనా యూకేలో గూఢచర్యం కోసం అవసరమైన నిర్మాణాలు చేస్తోందని డెయిలీ మెయిల్ వెల్లడించింది. అందుకే ఈ భవనంలోని కల్చరల్ ఎక్స్‌ఛేంజి విభాగాన్ని మాత్రం యూకే అధికారుల తనిఖీ నుంచి మినహాయించాలని చైనా అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా గూఢచర్యం కోసం వాడే వాటిని కల్చరల్ ఇంట్రెస్ట్స్, ఎక్స్‌ఛేంజిగా పేర్కొంటారని అమెరికాకు చెందిన మాజీ సెక్యూరిటీ అధికారి వెల్లడించడం గమనార్హం.
Also Read : ట్రైన్ లో నా బూ*బ్స్ పట్టుకొని లాగాడు ..హీరోయిన్ సంచలన వీడియో వైరల్!
కార్యాలయ నిర్మాణం వెనుక...
లండన్‌లో బ్రిటన్ రాయల్ మింట్‌కు చెందిన 5.4 ఎకరాల భూమిని 2018లో చైనా కొనుగోలు చేసింది.1809--1967 మధ్యలో బ్రిటన్ రాయల్ మింట్‌లో ఇది భాగంగా ఉండేది. అంతకు ముందు బ్లాక్ డెత్‌ప్లేగు సమాధులు ఇక్కడ ఉండేవి. దానికి ముందు రాయల్ నేవీ కూడా కొన్నాళ్లు ఈ స్థలాన్ని వినియోగించుకొంది. ఇది టవర్ ఆఫ్ లండన్‌కు అత్యంత సమీపంలోనే ఉంది. ఆ తర్వాత ఈ భూ భాగాన్ని బ్రిటన్ రాజకుటుంబం రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అమ్మింది. అలా ఈ స్థలాన్ని చైనా కొనుగోలు చేసింది. ఈ స్థలంలో ఐరోపాలోనే అతిపెద్ద దౌత్యకార్యాలయం(ఎంబసీ) గా నిర్మించాలని బీజింగ్ భావిస్తోంది. ఇందులో 225 ఇళ్లు, కల్చరల్ ఎక్స్‌ఛేంజి భవనం కూడా ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసింది. వాషింగ్టన్ డీసీలోని దౌత్యకార్యాలయం కంటే ఇది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. కొన్ని నెలల క్రితం చైనా దౌత్యకార్యాలయ నిర్మాణంపై ఆందోళనలు కూడా జరిగాయి. దీన్ని నిర్మించడం వల్ల అండన్ సమగ్ర సమచారానికి భంగం వాటిల్లే అవకాశం ఉందని భావిస్తోంది.
Also Read : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య!.. చెట్టుకు వేలాడుతూ