TG Crime : జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలిక దారుణ హత్య... గొంతు కోసి..

జగిత్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల గ్రామంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పక్కనే ఉన్నా విజయ్‌ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

New Update
Jagtial Murder

Jagtial Murder

TG Crime : జగిత్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల గ్రామంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన ఆకుల రాము, నవీన దంపతులకు ఇద్దరు పిల్లలు. రాము ఉపాధి కోసం గత కొంతకాలం క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. నవీన పిల్లలతో పాటు ఇక్కడే ఉంటోంది. కాగా వారి కూతురైన ఐదేళ్ల హితీక్ష శనివారం స్కూల్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. అనంతరం పిల్లలతో ఆడుకోవడానికి బయటకు వెళ్లింది.రాత్రి 8 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది చుట్టూ పక్కల వెతికారు.

Also Read :  టాయిలెట్‌లో ఉండి వర్చువల్‌ విచారణ.. కోర్టు కీలక ఆదేశం

Also Read :  ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర

Jagtial Murder Case

బంధువులు, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించక పోవడంతో  స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. పక్కనే ఉన్నా విజయ్‌ అనే వ్యక్తి ఇంటి బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.బాత్రూంలోనే బాలిక గొంతు కోసి హత్య చేయబడిందని తల్లిదండ్రులు గుర్తించారు. బాలిక మృతదేహం లభించిన ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురికావడం అందరినీ కలచివేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

Also Read: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

అప్పటివరకు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేశ్‌బాబు, ఎస్సై చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని గుర్తించిన ఇంటి యజమాని విజయ్‌కు ఫోన్‌ చేయగా నర్సంపేటలో ఉన్నట్లు సమాధానమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో కూలీగా పనిచేసే విజయ్‌ మద్యానికి బానిసయ్యాడు. ఎక్కువగా ఇంట్లో ఉండని విజయ్‌ ఈ హత్య చేశాడా? లేదా అనేది నిర్ధారించడానికి అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్‌ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడికి పెళ్లయినా భార్య, కుమార్తె వదిలివెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

crime news today | crime news telugu | child killed | jagitial news today | jagittala-district | jagityala-district | crime news

Advertisment
Advertisment
తాజా కథనాలు