Bird Flu: గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. చికెన్‌ తినవద్దని హెచ్చరికలు జారీ

తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో నెల రోజుల పాటు చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు.

New Update
bird flue

bird flue Photograph: (bird flue)

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బ్లర్డ్‌ ఫ్లూతో చనిపోతున్న కోళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో అధికారులు కొన్ని శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. వీటిలో శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

ఇది కూడా చూడండి: Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

నెల రోజుల పాటు చికెన్ తినవద్దని..

నెల రోజుల పాటు ఎవరూ కూడా చికెన్ తినవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 9542908025 నెంబర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా కూడా బర్డ్స్ ఫ్లూ వల్ల కోళ్లు చనిపోతుంటే మాత్రం వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ఇది కూడా చూడండి: Uttarakhand:హీరోయిన్‌ను చేస్తామని.. మాజీ సీఎం కుమార్తెనే మోసం చేశారు!

నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరులో ఎక్కువగా బర్డ్ ఫ్లూ ఉంది. ఇప్పటి వరకు గోదావరి జిల్లాల్లో సుమారుగా రెండు లక్షల కోళ్లు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చికెన్ తినడం వల్ల మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. చికెన్ అసలు తినవద్దని, దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana Beers : పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత? .. ప్రభుత్వానికి ఎంత ఆదాయం ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు