/rtv/media/media_files/2025/02/11/TazpI9TpmzJgSZ38Yh1K.jpg)
aravind mann
ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ఆప్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎఫెక్ట్ పంజాబ్ మీద కూడా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నేడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు . పంజాబ్‌కు చెందిన దాదాపు 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, వారు పార్టీ మారే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు బజ్వా ఆరోపించారు.
Also Read : ఉదయాన్నే వీటిని తింటే.. బోలెడన్నీ ప్రయోజనాలు
"ఈ మహారాష్ట్ర విమానం చండీగఢ్‌లో ల్యాండ్ అయినప్పుడల్లా, ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) గా మారే మొదటి ప్రయాణీకుడు భగవంత్ మాన్ (Bhagawant Mann)" అని అన్నారు. అంతేకాకుండా లూథియానాలో జరగనున్న ఉప ఎన్నికలో కేజ్రీవాల్ పోటీ చేసి పంజాబ్ ప్రభుత్వాన్ని నడిపించే అవకాశం ఉందని బజ్వా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆప్ ఈ మీటింగ్ పెట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 117 సీట్లలో 92 గెలుచుకుని కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకోగా, శిరోమణి అకాలీదళ్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరిగి 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : రంగరాజన్‌పై దాడి చేసింది వీడే.. రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి వసూళ్ల దందా!
48 సీట్లతో అధికారంలోకి
ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ (AAP) ఘోర పరాజయం పాలైంది. బీజేపీ 48 సీట్లతో అధికారంలోకి రాగా ఆప్ 22 సీట్ల వద్దే ఆగిపోయింది. దీంతో 27- ఏళ్ల తరువాత బీజేపీ దేశరాజధానిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ మూడోసారి కూడా సున్నా సీట్లకే పరిమితం అయింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటినేతలు ఓడిపోయారు. సీఎం అతిషి తన స్థానాన్ని కాపాడుకున్నారు.
మరోవైపు ఢిల్లీ ఓటమితో ఇండియా కూటమిలో కొనసాగాలో లేదో తేల్చుకోలేని పరిస్థితిలో ఆప్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ఉన్న కూటమిని వీడొచ్చని వారు అంచనా వేస్తున్నారు.
Also Read : Telangana Beers : టైమ్ చూసి పెంచారు కదరా.. ! పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత?
Also Read : అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us