/rtv/media/media_files/2025/02/11/MMIZ8Bz3NZ8nooENDUBh.jpg)
veera raghavareddy
చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కొవ్వూరి వీర రాఘవరెడ్డి(45)తో పాటుగా మరో ఐదుగురిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఇందులో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే విచారణలో వీర రాఘవరెడ్డి పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు.
ఇతగాడు రామరాజ్యం పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. రంగరాజన్‌పై దాదాపుగా 22 మంది దాడికి దిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన పది మందిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. త్వరగా ఫేమస్ కావాలనే ఉద్దేశ్యంతోనే రంగరాజన్‌పై దాడి చేసినట్లుగా వీర రాఘవరెడ్డి ఒప్పుకున్నట్లుగా తెలిసింది.
స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా
కొవ్వూరి వీర రాఘవరెడ్డి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అన్నపర్తి మండలం కొప్పూరు గ్రామం. గత కొంత కాలంగా హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్న వీర రాఘవ రెడ్డి 2022లో రామరాజ్యం అనే పేరుతో ఓ వెబ్ సైట్ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా యూట్యూబ్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్స్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి ప్రచారం షురూ చేశాడు. ఇందులో యూత్ ను ప్రేరేపించే విధంగా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ఆర్మీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే రామరాజ్యం ఆర్మీ పేరుతో రిక్రూట్‌మెంట్ కూడా మొదలుపెట్టాడు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 25 మందిని రిక్రూట్ చేసుకుని వారికి నెలకు రూ.20 వేల చొప్పున జీతం ఇస్తున్నాడు. ఈ 25 మందిని 2025 జనవరి 24వ తేదీన ఏపీలోని పశ్చిమ గోదావరి తణుకుకు తీసుకెళ్లి మీటింగ్ కూడా నిర్వహించాడు.
ఫిబ్రవరి 07వ తేదీన ఉదయం మూడు కార్లలో వీర రాఘవరెడ్డితో పాటుగా ఆర్మీ సభ్యులందరూ రంగరాజన్ ఇంటికి చేరుకున్నారు. ఆర్మీ గురించి వివరించి తమ ఆర్గనైజేషన్‌కు ఆర్థిక సాయం అందించాలని ఆయన్ను డిమాండ్ చేశారు. అంతేకాకుండా చిలుకూరు బాలాజీ గుడి నిర్వహణలోనూ తమకు భాగస్వామ్యం కల్పించాలని బెదిరింపులకు దిగారు. వారి డిమాండ్లకు రంగరాజన్ అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : టైమ్ చూసి పెంచారు కదరా.. ! పెరిగిన బీర్ల ధరలు.. లైట్, స్ట్రాంగ్ ఎంత?