/rtv/media/media_files/2025/02/11/IuxGAzxV1QtGqQUjfGAD.jpg)
Elon Musk, Sam Altoman
చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటోంది. వీరిద్దరి మధ్యా కొంతకాలంగా విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలో ఈ కృత్రిమ మేధ సంస్థపై విమర్శలు చేసిన మస్క్.. దానిపై దావా కూడా వేశారు. అసలు మొదటి నుంచి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వల్ల ప్రపంచానికి చేటని మస్క్ అంటూనే ఉన్నారు. తాజాగా మస్క్ చూపు ఓపెన్ ఏఐ మీద పడింది. ఆ సంస్థను కొనుగోలు చేస్తానంటూ భారీ ఆఫర్ ను ప్రకటించారు. ఓపెన్ ఏఐని పూర్తిగా లాభాపేక్ష గల కంపెనీగా మార్చాలని శామ్ ఆల్ట్‌మన్, ఆయన బోర్డు కోరుకుంటే.. అందుకు తాము సిద్ధమని.. దానికి తగిన పరిహారం కూడా ఇస్తామని మస్క్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ అధికారికంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
చురకలంటించిన శామ్ ఆల్ట్‌మన్..
అయితే దీనిపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. ఎక్స్ లో తన రిప్లైను పెట్టారు కూడా. మస్క్ ఆపర్ ను తిరస్కరిస్తున్నామని...కావాలంటే ట్విట్టర్ న 9.47 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామంటూ రివర్ట్ ఇచ్చారు. దీనిపై ఎలాన్ మస్క్ తిరిగి స్పందించారు. శామ్ ఆల్టన్ ను మోసగాడు అంటూ ఘాటూ విమర్శలు చేశారు.
మొదట ఓపెన్ ఏఐను శామ్ ఆల్ట్‌మన్ బృందం మొదలుపెట్టినప్పుడు మస్క్ కూడా అందులో పార్ట్. ఆయన అందులో పెట్టుబడులు పెట్టారు. కానీ 2018లో అందులో నుంచి మస్క్ బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఇందులో మైక్రోసాఫ్ట్ ఎంటర్ అయింది. 14 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈక్రమంలోనే ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్‌పై మస్క్ గతేడాది దావా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ అందులో ఆరోపించారు. ఆ తర్వాత మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేశారు. అయితే ఓపెన్ ఏఐ తర్వాత విపరీతంగా అభివృద్ధి చెందింది. దీని నుంచి వచ్చిన చాట్ జీపీటీ ఆరు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.
Also Read : ఏంటీ నిజమా.. రూ. 200 నోటును బ్యాన్ చేస్తున్నారా.. ఆర్బీఐ కీలక ప్రకటన!