BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ గా తెలుస్తోంది.

New Update
kcr vs revanth

kcr vs revanth

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్‌ఎస్‌ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన  బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈ నాలుగు జిల్లాల నుంచే ఆ పార్టీ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,  హరీశ్, కవితలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  

బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రావు, ఓయూ జేఏసీ మాజీ నేత రాజారాం యాదవ్ పోటీ పడినప్పటికీ.. కేసీఆర్​మాత్రం ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు పార్టీ బీఫామ్ కోసం ఎదురుచూసిన రవీందర్ సింగ్ సోమవారం రోజున  ఇండిపెండెంట్ గానే రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

పోటీలో లేకపోవడమే స్కెచ్ 

అయితే బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తోంది.  సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు వెనుకనుంచి మద్దతు ఇచ్చి అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్‌ గా తెలుస్తోంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి, కాంగ్రెస్ ఓడిపోతే  ప్రజల్లో ఆ పార్టీ ప్రాభల్యం తగ్గుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి తోడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది.  అప్పుడు రాబోయే ఉప ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తు్ందని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.  తద్వారా కాంగ్రెస్ పని అయిపోయిందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.  ఎమ్మెల్యే ఎన్నికలే  టార్గెట్ గా బీఆర్ఎస్ పావులు కదుపుతోందని సమాచారం.  మరి ఏం జరుగుతుందో చూడాలి.  

అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఖండించారు.  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవరని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవన్నారు.  ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు.   ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయని వాటిని మార్చాలన్నారు.  

Also Read : తెలంగాణలో చికెన్ తినేవారికి అలెర్ట్.. అధికారులు కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు