SSC: పోస్టుల సంఖ్య పెంచిన ఎస్ఎస్సీ
సీహెచ్ఎస్ఎల్-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ ఎస్ఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసంది.దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది.అంతకు ముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సీహెచ్ఎస్ఎల్-2024 ఉద్యోగాల సంఖ్యను సవరిస్తూ ఎస్ఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసంది.దాదాపు 3,954 పోస్టులను భర్తీ చేయనుంది.అంతకు ముందు 3,712 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14న ప్రభుత్వం ఎనికేపాడు టీడీపీ కార్యాలయ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. ఇందులో 50కి పైగా ప్రముఖ కంపెనీలు భాగం కానున్నాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్టుల్లో మార్పులు చేసింది. 2025 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే ఎగ్జామ్స్ ఉంటుంది. 63 బదులు 37సబ్జెక్టులు, 60 నిమిషాలు ఎగ్జామ్ టైం వంటి కీలక మార్పులు చేశారు.
దూరవిద్య, ఆన్లైన్ ప్రొగ్రామ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఫైక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని UGC పేర్కొంది. విద్యార్థులను అవి తప్పుదారి పట్టిస్తున్నాయని UGC విద్యార్థులను హెచ్చరించింది. అధికారిక వెబ్ సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాలని సూచించింది.
కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఖాళీలను UPSC, SSC ద్వారా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ పేరుతో స్కాలర్షిప్ అందించనుంది. పది, ఇంటర్, డిప్లొమో చదివిన తర్వాత బీటెక్, మెడిసిన్ ఏ విభాగం వారికైనా నగదు ఇవ్వనుంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 22 చివరి తేదీ.
ఈనెల 15, 16 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1, 368 కేంద్రాల్లో గ్రూప్–2 పరీక్ష నిర్వహించనున్నామని టీజీపీఎస్సీ తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
విజయవాడ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేయనున్నారు. కేవలం డిగ్రీ అర్హత, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్స్ ఉండనున్నాయి.
బీఎస్ఎఫ్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2024ను ప్రకటించింది. క్రీడా ప్రతిభ ఉన్న పురుష, మహిళా క్రీడాకారులకు ఉత్తమ అవకాశాన్ని అందిస్తోంది. దీని ద్వారా 275 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) గ్రూప్ -సీ పోస్టులను భర్తీ చేస్తోంది. డిసెంబర్ 30లో దరఖాస్తు చేసుకోవాలి.