నిరుద్యోగులకు రైల్వే శాఖ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. భారీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సుమారు 32 వేల లెవెల్ - 1 (గ్రూప్-డి) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పలు విభాగాల వారీగా పోస్టులు నిర్ణయించింది. అయితే ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. Also Read : ఏడాదికి లక్ష బ్రేక్ దర్శనాలు..అంతా బాబాయి చలవే! విద్యార్హత ప్రమాణాలను సడలింపు ఈ మేరకు విద్యార్హత ప్రమాణాలను సడలించింది. గతంలో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతితో పాటు NAC సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. కానీ తాజాగా సడలించిన విద్యార్హత ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా NCVT (నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్) జారీ చేసిన NAC (నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్) కలిగి ఉండాలని పేర్కొంది. Also Read: మహాకుంభమేళాకు వెళ్లేవారికి బిగ్ అప్‌డేట్.. ఐఎండీ కీలక ప్రకటన కాగా ఈ నోటిఫికేషన్‌లో అసిస్టెంట్, పాయింట్స్‌మన్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ తదితర ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి 23న ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22, 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. Also Read: ఓరి దేవుడా.. రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ఎలా బతికావ్ రా బాబు! ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలు రూ.18 వేల వేతనం అందిస్తారు.