TG TET: తెలంగాణలో నేటి నుంచి టెట్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. పేపర్ I, పేపర్ II రాసే టీచర్ అభ్యర్థులకు నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. జనవరి 20 వరకు ఈ పరీక్షలు జరగనుండగా ప్రిపరేషన్, ఆన్సర్ చేసే విధానంలో జాగ్రత్తగా ఉండాలని, అందుకోసం ఈ ఆర్టికల్‌లో సూచించిన టిప్స్ ఫాలో కావాలంటున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు.. ఈ మేరకు టెట్ పరీక్ష జనవరి 2న ప్రారంభమై 20న ముగుస్తుంది. 10 రోజుల పాటు 20 సెషన్లలో ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి రోజు పరీక్ష రెండు సెషన్స్ ఉంటాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 నుంచి 11:30 వరకు. రెండో సెషన్ 2 మధ్యాహ్నం 2:00 నుండి 4:30 వరకు నిర్వహిస్తున్నారు. టెట్ అర్హత సాధించడానికి జనరల్ కేటగిరీకి 60% మార్కులు, BC కేటగిరీకి 50%, SC, ST, వికలాంగ అభ్యర్థులకు 40% మార్కులు రావాలి. ఇది కూడా చదవండి: BCCI: చివరి టెస్టు నుంచి రోహిత్ ఔట్.. కోహ్లీకే మళ్లీ కెప్టెన్సీ! ఇక పరీక్షకు వెళ్లేటప్పుడు హాల్ టికెట్ ప్రింట్ అవుట్ తప్పనిసరి. మీ హాల్ టికెట్‌పై ఇచ్చిన సూచనలు లేదా మార్గదర్శకాలను సరి చూసుకోండి. ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫొటో, ఏదైనా ఐడి కార్టు (ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్) తీసుకుకెళ్లాలి. ఆన్ లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆప్షన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అందుకు తెలిసిన ప్రతి ప్రశ్నకు సమాధానం పెట్టండి. ఏ ఒక్క ప్రశ్నను కూడా వదిలేయద్దు. ఇక పేపర్-I అభ్యర్థులు 1 నుంచి 5 తరగతి పిల్లలకు బోధిస్తారు. పేపర్-II అభ్యర్థులు VI నుంచి VIII తరగతులకు క్లాసులు చెబుతారు. ఇది కూడా చదవండి: Freebies: ఉచితాలపై ఆధారపడొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు