AP Jobs: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం న్యూ ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో కొత్తగా భర్తీ చేయాల్సిన 866 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మొత్తం 18 నోటిఫికేషన్లు విడుదల చేయనుండగా.. అటవీ శాఖలోనే 814 పోస్టులున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే ఈ నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తు్న్నట్లు చంద్రబాబు సర్కార్ తెలిపింది.
ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్..
ఇక ఈ నోటిఫికేషన్‌లో బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీ చేయనున్నట్లు పరిపాలన శాఖ పేర్కొంది. వీటితోపాటు గ్రూప్-1 11/2023 నోటిఫికేషన్ మెయిన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించనున్నారు. ఇక 2025 జూన్‌లో పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ భర్తీ కోసం రాతపరీక్షలను నిర్వహించేందుకు చంద్రబాబు గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.
ఇది కూడా చదవండి: M Vishnu: మంచు విష్ణు సంచలన పోస్ట్.. ఎప్పటికీ మరిచిపోవద్దంటూ!
మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్స్..
అలాగే మరిన్ని పోస్టులు కూడా ఈ నోటిఫికేషన్ లో విడుదల చేయనుండగా ఇప్పటికే విడుదలైన పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, పర్యావరణ శాఖలో ఎనలిస్టు గ్రేడ్-2, ఎన్టీఆర్ వర్సిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్, ఎన్టీఆర్ వర్సిటీ జూనియర్ అసిస్టెంట్, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, ఏపీ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆరోగ్యశాఖలో లైబ్రేరియన్, అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్, ఏపీ భూగర్భ నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్, ఏపీ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ సర్వీసెస్‌లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటికి 2025 మార్చి చివరి నుంచి అదే ఏడాది జూన్ నెలాఖరులోగా పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.