Hydra Jobs: హైడ్రాలో 970 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. 

New Update
Hydra-commissioner

Hydra 970 job notification

Hydra: తెలంగాణ నిరుద్యోగులకు హైడ్రా గుడ్ న్యూస్ చెప్పింది. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన హైడ్రాలో 970 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 203 మంది మేనేజర్లు, 767 మంది అసిస్టెంట్లను నియమించనున్నట్లు తెలిపారు. అర్హతలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. 

ఎంపికైన అభ్యర్థులను 7 ప్యాకేజీలు

ఇక ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను 7 ప్యాకేజీలుగా విభజించనున్నారు. 2 మేనేజర్లకు, 5 అసిస్టెంట్లకు ప్యాకేజీలుండనున్నాయి. ఇక ఉద్యోగుల జీతాలు ఒక యేడాదికి రూ.31.70 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. మేనేజర్లకు నెలకు రూ.22,750, అసిస్టెంట్లకు రూ.19,500 ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగాలు చేపట్టిన అనంతరం అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించాలి. హైదరాబాద్ పరిధిలోని ఖాళీ స్థలాలు, నీటి వనరులు, పార్కులు, లే అవుట్, ప్రభుత్వ భూములు, ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన నాలాలను రక్షణకు చర్యలు చేపట్టాలి.

ఇది కూడా చదవండి: Jaiswal: టెస్టుల్లో జైస్వాల్ సరికొత్త రికార్డు.. భారత తొలి బ్యాటర్!

హైడ్రా పోలీస్ స్టేషన్, ఎఫ్ ఎమ్..


ఇదిలా ఉంటే త్వరలోనే హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఇక హైడ్రాకు ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహకారం ఉందని, అక్రమ కట్టాడాలు కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ వెల్లడించారు. ఇక మరికొన్ని రోజుల్లో హైడ్రా ఎఫ్ఎం ఛానెల్ కూడా తీసుకురానున్నారట. 

ఇది కూడా చదవండి: Kishan Reddy: సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి: కిషన్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు