/rtv/media/media_files/2025/08/31/jobs-2025-08-31-19-30-22.jpg)
Jobs
సుప్రీంకోర్టు(Supreme Court) గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఏడాదికి కోర్టు మాస్టర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది. గెజిటెడ్ పోస్టులైన ఈ ఉద్యోగాలు 30 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.67,700 జీతంతో సహా ఇతర భత్యాలు ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ 30 పోస్టుల్లో 16 పోస్టులు అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి, 8 వెనుకబడిన తరగతులకు, 4 షెడ్యూల్డ్ కులాలకు, మరో రెండు 2 షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ భారీ బాంబు.. ఎఫ్ 1 వీసాపై ఇకపై అమెరికా వెళ్లడం కష్టమే!
Supreme Court Of India Recruitment
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లీష్)లో నిమిషానికి 120 పదాల వేగం, అలాగే కంప్యూటర్‌లో నిమిషంలో 40 పదాలు టైప్ చేయాలి. సంబంధిత స్టెనోగ్రఫీ లేదా సెక్రటేరిల్ పాత్రల్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Also Read: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం
ఎంపిక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. 1. షార్ట్‌హ్యాండ్ టెస్ట్, 2. ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష, 3.కంప్యూటర్‌లో టైపింగ్ స్పీడ్ టెస్ట్, 4.ఇంటర్వ్యూ. ఆసక్తిగల అభ్యర్థులు కేవలంwww.sci.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ.1500 ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రూ.750 ఫీజు ఉంది. యూసీఓ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే ద్వారా పేమెంట్ చెల్లించవచ్చు.
Also Read: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్ చేస్తే నదిలో మృతదేహాం
మరోవైపు ఏపీలో అటవీశాఖలో భర్తీ చేసే పోస్టులపై కూడా అప్‌డేట్ వచ్చింది. బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల పరీక్షకు సంబంధించి తాజాగా హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పోస్టుల్లో 256 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 435 అసెస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఇందులో స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్ నిర్వహిస్తారు. స్ర్కీనింగ్ టెస్టులో అర్హత పొందిన వాళ్లకే మెయిన్ పరీక్ష ఉంటుంది. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్ర్కీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్టుతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.
Also Read: తల్లిని చంపి ఆత్మహత్య చేసుకోమన్న చాట్ GPT.. 2 ప్రాణాలు బలి తీసుకున్న AI